శామ్‌సంగ్ నుంచి సరికొత్త బడ్జెట్‌ మొబైల్ | Samsung Budget Mobile Galaxy M02s Launch in India | Sakshi
Sakshi News home page

శామ్‌సంగ్ నుంచి సరికొత్త బడ్జెట్‌ మొబైల్

Published Thu, Jan 7 2021 3:52 PM | Last Updated on Thu, Jan 7 2021 3:56 PM

Samsung Budget Mobile Galaxy M02s Launch in India - Sakshi

న్యూఢిల్లీ: శామ్‌సంగ్ సంస్థ గెలాక్సీ ఎం02ఎస్ అనే మరో సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ను తాజాగా భారతదేశంలో విడుదల చేసింది. ఈ బడ్జెట్ హ్యాండ్‌సెట్ ధర రూ.10,000. ఇందులో 15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. అలాగే ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్ చేత పనిచేయనుంది. కొద్ది రోజుల క్రితం ఈ మొబైల్ నేపాల్‌లో లాంచ్ అయ్యింది.(చదవండి: కొత్త ఏడాదిలో వాట్సాప్ నుంచి బిగ్ అప్‌డేట్

గెలాక్సీ ఎం02ఎస్ ఫీచర్స్:
శామ్‌సంగ్ గెలాక్సీ ఎం02ఎస్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత శామ్‌సంగ్ వన్ యూఐతో నడుస్తుంది. ఇందులో 6.5-అంగుళాల (720x1,560 పిక్సెల్స్) వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ టిఎఫ్‌టి ఎల్‌సిడి డిస్‌ప్లేను 20: 9 నిష్పత్తితో కలిగి ఉంది. ఇది అడ్రినో 506 జిపియూతో స్నాప్‌డ్రాగన్450 ఆక్టా-కోర్ ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. దీనిలో 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. మైక్రో ఎస్డి కార్డు ద్వారా స్టోరేజ్ను 1టీబీ వరకు విస్తరించుకోవచ్చు. శామ్‌సంగ్ గెలాక్సీ ఎం02ఎస్లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం ఇందులో ఎఫ్/2.2 ఎపర్చర్‌తో 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇందులో 15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఫోన్ బరువు 196 గ్రాములు. గెలాక్సీ ఎం02ఎస్ 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ ఆప్షన్‌కు రూ.8,999, 4జీబీ ర్యామ్+ 64జీబీ స్టోరేజ్ మోడల్‌కు రూ.9,999గా ఉంది. ఫోన్ బ్లాక్, బ్లూ మరియు రెడ్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement