షియోమీ, రియల్ మీ సంస్థలు బడ్జెట్ ధరలో 5జీ మొబైల్ ఫోన్లను తీసుకొస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పడు ఇదే తరహాలో శామ్‌సంగ్ కూడా బడ్జెట్ లో 5జీ మొబైల్ ఫోన్ ని తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్ భారతదేశం, ఇతర ఆగ్నేయాసియా దేశాల వంటి మార్కెట్లలో కూడా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో లాంచ్ చేసిన శామ్‌సంగ్ గెలాక్సీ ఏ21కి తర్వాతి వెర్షన్ గా శామ్‌సంగ్ గెలాక్సీ ఏ22 5జీని భావిస్తున్నారు. కొన్ని నివేదికల ప్రకారం శామ్‌సంగ్ గెలాక్సీ ఏ22 5జీ మొబైల్ 2021 రెండవ భాగంలో తీసుకురానునట్లు సమాచారం. దీని ధర రెండు లక్షల కొరియన్ వాంగ్‌లు(సుమారు రూ.13,300)గా నిర్ణయించారు. (చదవండి: 5000లు పెడితే రోజుకు 500 వస్తాయనే ఆశతో..)
గెలాక్సీ ఏ22 5జీ కన్నా ముందు గెలాక్సీ ఏ32 5జీ మొబైల్ ని మార్కెట్లోకి తీసుకువస్తారని సమాచారం. కొత్త శామ్‌సంగ్ గెలాక్సీ ఏ22 5జీ మొబైల్ హువావే, ఒప్పో, వివో, షియోమి వంటి కంపెనీ 5జీ మొబైల్స్ కీ పోటీగా తీసుకొస్తున్నట్లు సమాచారం. గెలాక్సీ ఏ22 5జీ మొబైల్ తయారీ కోసం శాంసంగ్ జాయింట్ డెవలప్‌మెంట్ ప్రొడక్షన్ మెథడ్(జేడీఎం) పద్ధతిని ఎంచుకున్నారు. అంటే ఈ మొబైల్ కి సంబందించిన రూపకల్పనలో ప్రధాన భాగాలు, కొన్ని స్పెసిఫికేషన్లను మాత్రమే శామ్‌సంగ్ రూపొందిస్తుంది. మిగతా డిజైన్, ప్రొడక్షన్ ప్రక్రియ మొత్తం అవుట్ సోర్స్ చూసుకుంటుంది. ఈ ఏడాది రవాణా చేసిన శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ స్మార్ట్‌ఫోన్‌లలో 20-30 శాతం జేడీఎం పద్ధతిని ఉపయోగించి ఉత్పత్తి చేసినట్లు సమాచారం. శామ్‌సంగ్ గెలాక్సీ ఏ22 5జీ మొబైల్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ ఉపయోగిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment