రెడ్‌మీ కే40లో పవర్ ఫుల్ ప్రాసెసర్ | Redmi K40 Comes With Snapdragon 888 SoC | Sakshi
Sakshi News home page

రెడ్‌మీ కే40లో పవర్ ఫుల్ ప్రాసెసర్

Published Tue, Jan 12 2021 7:26 PM | Last Updated on Tue, Jan 12 2021 7:35 PM

Redmi K40 Comes With Snapdragon 888 SoC - Sakshi

రెడ్‌మీ కే40 మొబైల్ ను వచ్చే నెలలో చైనాలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ మొబైల్ సరికొత్త క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో రానున్నట్లు కంపెనీ ధ్రువీకరించింది. రెడ్‌మీ కే40 ధరను కూడా రెడ్‌మీ జనరల్ మేనేజర్ "లు వీబింగ్" వెల్లడించారు. రెడ్‌మీ కే40 సిరీస్ గతేడాది ప్రారంభించిన రెడ్‌మీ కే30 సిరీస్ కొనసాగింపుగా రానుంది. ప్రస్తుతానికి రెడ్‌మీ కే40 స్పెసిఫికేషన్స్ గురుంచి ఇప్పటివరకు తెలియదు. రెడ్‌మీ కే40 సిరీస్ బేస్ వేరియంట్ ధర సిఎన్‌వై 2,999(సుమారు రూ. 34,000) నుంచి ప్రారంభం కానునట్లు "లు వీబింగ్" ధృవీకరించారు. రెడ్‌మీ కే40 సిరీస్‌లో మెరుగైన ర్యామ్,స్టోరేజ్‌తో పాటు ఎక్కువ ప్రీమియం ఆప్షన్స్‌ తీసుకురానున్నట్లు భావిస్తున్నారు. కంపెనీ పేర్కొన్నట్లుగా దీనిలో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తీసుకురానున్నారు. రెడ్‌మీ కే40 అమోలెడ్ డిస్‌ప్లే తీసుకురానున్నట్లు సమాచారం. దీనిలో 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌తో పాటు యుఎస్‌బి టైప్-సి పోర్ట్‌ను తీసుకువచ్చే అవకాశం ఉంది.(చదవండి: వాట్సాప్, సిగ్నల్ కు ప్రధాన తేడా ఏంటి?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement