గత కొన్ని నెలలుగా మొబైల్ పరిశ్రమలో పెద్ద పెద్ద కంపెనీలు రోలబుల్ ఫోన్ తీసుకోని రావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో షియోమీ కూడా చేరబోతోంది. త్వరలో షియోమీ రోలబుల్ స్మార్ట్‌ఫోన్‌ను మొబైల్ లవర్స్ కి పరిచయం చేయబోతోంది. ఇప్పటికే ఈ టెక్నాలజీ ఇంకా అభివృద్ధి దశలో ఉన్నపటికీ, దీనిని భారీ ఎత్తున తీసుకురావడానికి షియోమీ ప్రయత్నిస్తుంది. సాంసంగ్ నుంచి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లు వస్తున్నాయి. గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది సాంసంగ్. ఎల్‌జీ ఇదివరకే డ్యూయెల్ డిస్‌ప్లో స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది. త్వరలో మరో మోడల్ ని కూడా తీసుకురాబోతుంది. (చదవండి: డిస్నీప్లస్‌లో హాట్‌స్టార్.. హాట్‌హాట్)
టిసిఎల్ మరియు ఒప్పో తీసుకొస్తున్ రోలబుల్ డిస్‌ప్లే ఫోన్‌ల మాదిరిగానే షియోమి ఫోన్ కూడా అలాంటి డిజైన్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. షియోమీ యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ మరియు ట్రేడ్మార్క్ కార్యాలయంలో రోలబుల్ ఫోన్ పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకుంది. పేటెంట్ లో చూపినట్లుగా దీనిని రోల్ చేస్తే స్మార్ట్‌ఫోన్ లాగా కనిపిస్తుంది. ట్యాబ్లెట్ లాగా కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. అకా కాన్సెప్ట్ క్రియేటర్ షియోమీ రోలబుల్ పేటెంట్ల ఇమేజెస్ సహాయంతో షావోమీ రోలబుల్ స్మార్ట్‌ఫోన్ రెండర్ క్రియేట్ చేశాడు. ఇది చూడటానికి మి మిక్స్ ఆల్ఫా కాన్సెప్ట్ లాగా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ డిజైన్ కేవలం స్కెచ్ మాత్రమే. డివైజ్ తయారైన తర్వాత దీనికి భిన్నంగా కూడా ఉండొచ్చు. ఈ మొబైల్ వచ్చే ఏడాది ప్రారంభంలో లేదా చివరలో రావచ్చు.
Comments
Please login to add a commentAdd a comment