షియోమీ కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబందించిన స్పెసిఫికేషన్లు కూడా ఆన్ లైన్‌లో లీకయ్యయి. ఇది రెడ్ మీ కే40 సిరీస్ లేదా ఎంఐ 11 సిరీస్‌కు సంబంధించిన ఫోన్ అని టెక్ నిపుణులు భావిస్తున్నారు. రెడ్ మీ కే40 స్మార్ట్ ఫోన్ ఈ నెలలోనే లాంచ్ కానుంది. ఇందులో వనిల్లా మోడల్ క్వాల్‌కామ్ నుంచి సబ్-ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌ను షియోమీ తీసుకొస్తున్నట్లు సమాచారం.(చదవండి: బిగ్ బ్యాటరీతో విడుదలైన పోకో ఎం3!)
ఇందులో పంచ్ హోల్ కటౌట్ ఉన్న ఓఎల్ఈడీ డిస్ప్లేను షియోమీ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు ఒక ప్రముఖ టిప్‌స్టర్ తెలిపారు. అలాగే మిడ్ రేంజ్ మొబైల్ లో ఉపయోగించే ఎస్ఎం7350 ప్రాసెసర్ తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇది 5ఎక్స్ జూమ్ కి సపోర్ట్ చేసే 64 ఎంపీ కెమెరా కలిగి ఉండవచ్చని టిప్‌స్టర్ పేపేర్కొన్నారు. ఇది రాబోయే రెడ్‌మి కె40 లేదా ఎంఐ 11 సిరీస్ వేరియంట్ కావచ్చు అని భావిస్తున్నారు. రెడ్ మీ కే40 స్మార్ట్ ఫోన్ ఈ నెలలోనే లాంచ్ సిద్ధంగా ఉంది. దీని ధర సిఎన్‌వై 2,999(సుమారు రూ.34,000) నుంచి ప్రారంభమవుతుంది. రెడ్ మీ కే40లో మిడ్ రేంజ్ ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. గతేడాది లాంచ్ అయిన క్వాల్కాం స్నాప్ డ్రాగన్ 765జీకి తర్వాత వెర్షన్‌గా స్నాప్ డ్రాగన్ 775జీ రానుంది. ఈ ప్రాసెసర్ ను ఇందులో తీసుకురానున్నట్లు అంచనా.
Comments
Please login to add a commentAdd a comment