నోకియా 5.4 మొబైల్ ఫీచర్స్ టీజ్ చేసిన ఫ్లిప్‌కార్ట్ | Nokia 5.4 India Launch Teased by Flipkart | Sakshi
Sakshi News home page

నోకియా 5.4 మొబైల్ ఫీచర్స్ టీజ్ చేసిన ఫ్లిప్‌కార్ట్

Published Mon, Feb 8 2021 6:41 PM | Last Updated on Mon, Feb 8 2021 7:02 PM

Nokia 5.4 India Launch Teased by Flipkart  - Sakshi

నోకియా లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న నోకియా 5.4 స్మార్ట్‌ఫోన్ ను కంపెనీ టీజ్ చేసింది. విడుదలకు ముందే ఫ్లిప్‌కార్ట్ నోకియా 5.4 కోసం ప్రత్యేకంగా ఒక ల్యాండింగ్ పేజీని సృష్టించింది. ఇందులో దీనికి సంబంధించిన ఫీచర్లను కూడా టీజ్ చేశారు. నోకియా 5.3 వారసుడిగా నోకియా 5.4ను తీసుకొస్తున్నారు. ఇందులో హోల్ పంచ్ డిస్ ప్లే డిజైన్‌ను అందించారు. నోకియా 5.4లో ఓజో ఆడియో సపోర్ట్‌తో పాటు 128జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉంది. అయితే తాజాగా వస్తున్న కథనాల ప్రకారం ఫిబ్రవరి 10వ తేదీన ఈ ఫోన్ విడుదల కానుంది.

నోకియా 5.4 ఫీచర్స్(అంచనా):
డిస్‌ప్లే: 6.39-అంగుళాల హెచ్‌డి ప్లస్ 
బ్యాటరీ: 4,000ఎంఏహెచ్(10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్)
ర్యామ్: 4జీబీ, 6జీబీ
స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 662 
బ్యాక్ కెమెరా: 48ఎంపీ + 5ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ
సెల్ఫీ కెమెరా: 16 ఎంపీ
ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 10
కలర్స్:  డస్క్, పోలార్ నైట్
ధర: రూ.15 వేలు

చదవండి: వాట్సాప్‌ను వెనక్కి నెట్టేసిన టెలిగ్రాం
              లీకైన వన్‌ప్లస్ 9ప్రో ఫోటోలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement