చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ షియోమీ రోజు రోజుకి సంచలనాలను సృష్టిస్తుంది. తక్కువ ధరకే మొబైల్ ఫోన్లు, టీవీలు, ఇయర్‌ఫోన్లు వంటి ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పతులను తక్కువ ధరకే అందిస్తూ ప్రపంచంలోని చాలా మంది వినియోగదారులను ఆకర్షిస్తుంది. తక్కువ కాలంలోనే శాంసంగ్, యాపిల్ వంటి ఇతర కంపెనీలను దీటుగా ఎదుర్కొంటూ షియోమీ తన హవా కొనసాగిస్తోంది. షియోమీ కేవలం 6 సంవత్సరాల కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్లకు పైగా రెడ్‌మి నోట్ సిరీస్ ఫోన్‌లను విక్రయించినట్లు షియోమీ ప్రకటించింది.
రెడ్‌మీ ఇండియా ఈ గణాంకాలను తెలుపుతూ ట్విటర్లో ఈ విషయాన్ని షేర్ చేసింది. మొట్ట మొదటి రెడ్‌మి నోట్ సిరీస్ ఫోన్‌ను 2014లో లాంచ్ చేశారు. అప్పటి నుంచి కంపెనీ రెడ్‌మి నోట్ సిరీస్ ఫోన్‌లను వరుసగా విడుదల చేస్తుంది. షియోమీ ప్రపంచ మూడో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీగా ఆవిర్భవించింది. షియోమీ 2014లో తొలిసారి రెడ్‌మి నోట్ సిరీస్‌ను ఫోన్‌లను విడుదల చేసింది. 2015లో రెడ్‌మి నోట్2, రెడ్‌మి నోట్3, 2016లో రెడ్‌మి నోట్4 తర్వాత 2017లో రెడ్‌మి నోట్ 5ఎ వచ్చింది. ఆ తర్వాత 2018లో రెడ్‌మి నోట్5, రెడ్‌మి నోట్ 6 సిరీస్ తీసుకోని వచ్చింది. 2019లో రెడ్‌మి నోట్7, రెడ్‌మి నోట్8 సిరీస్‌ను వరుసగా విడుదల చేసింది. 2020లో రెడ్‌మీ నోట్ 9 సిరీస్ ఫోన్లను విడుదల చేయగా త్వరలోనే రెడ్‌మి నోట్ 10 సిరీస్ ఫోన్లను 2021 మొదటి త్రైమాసికంలో తీసుకురావాలని షియోమీ యోచిస్తుంది.
#RedmiNote series smartphones has shipped more than 2⃣0⃣,0⃣0⃣,0⃣0⃣,0⃣0⃣0⃣ units globally! 🌏
— Redmi India - #Redmi9Power is Here! (@RedmiIndia) February 8, 2021
Crazy feat achieved by our most feature packed smartphone series! This milestone is a testament to #Redmi Note being the most-loved series in the world! ❤️ pic.twitter.com/sUdhmC9neH
Comments
Please login to add a commentAdd a comment