రియల్‌మీ వి15 మొబైల్ 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి బదులుగా 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ జనవరి 7న చైనాలో లాంచ్ కానుంది. కంపెనీ గత కొన్ని రోజులుగా దాని డిజైన్‌ను టీజ్ చేస్తోంది. రియల్ మీ యొక్క చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ జు క్వి చేజ్ చైనా మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ వీబోలో 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను తీసుకొస్తున్నట్లు ధృవీకరించారు. రియల్‌మీ వి15 5జీ కనెక్టివిటీ, హోల్-పంచ్ కటౌట్ డిస్ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుందని భావిస్తున్నారు. రియల్‌మీ వి15 మొబైల్ లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 800యు ప్రాసెసర్ తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్ బరువు 176 గ్రాములు, 8.1 మీ.మీ మందంగా ఉంటుందని ఒక టిప్‌స్టర్ చెప్పారు. రియల్‌మీ రేపు(జనవరి 7న) చైనాలో మధ్యాహ్నం 11 గంటలకు (ఐఎస్ టీ ఉదయం 11:30 గంటలకు) ఫోన్‌ను ఆవిష్కరించనుంది. రియల్‌మీ వి15 భారతీయ మార్కెట్లోకి వస్తుందో లేదో చూడాలి.(చదవండి: ఎయిర్‌టెల్ యూజర్లకు బంపరాఫర్)
Comments
Please login to add a commentAdd a comment