శాంసంగ్ గెలాక్సీ ఎ72 మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్, ధర వివరాలు అనాటెల్ బ్రెజిల్ సర్టిఫికేషన్ సైట్‌లో లీక్ అయ్యాయి. ఆ సర్టిఫికేషన్ సైట్ జాబితాలో ఫోన్ యొక్క బ్యాటరీ సామర్థ్యం, ఫాస్ట్ ఛార్జింగ్ వివరాలు బయటకి లీక్ అయ్యాయి. శాంసంగ్ గెలాక్సీ ఎ72కు సంబందించిన వివరాలు గతంలో కూడా అనేక సందర్భాల్లో లీకయ్యాయి. లీకైన వివరాల ప్రకారం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్ చేత పనిచేయనున్నట్లు తెలుస్తుంది. ఇది ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ వెనుక 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుందని భావిస్తున్నారు.(చదవండి: షియోమీ ప్రియులకి గుడ్‌న్యూస్!)
శాంసంగ్ ఏ72 ఫీచర్స్
లీకైన వివరాల ప్రకారం 25వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. గతంలో వచ్చిన శాంసంగ్ గెలాక్సీ ఏ71కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ రానుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ71లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్ అనాటెల్ వెబ్ సైట్లో SM-A725M/DS మోడల్ నంబర్‌తో కనిపించింది. ఇందులో డిఎస్ అంటే డ్యూయల్ సిమ్ అని అర్థం. శామ్‌సంగ్ గెలాక్సీ ఎ72 బిగ్ 6.7-అంగుళాల డిస్ప్లే, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్‌తో పాటు దిగువన స్పీకర్ గ్రిల్ కలిగి ఉండవచ్చు. ఇవి తప్ప శాంసంగ్ గెలాక్సీ ఏ72కి సంబందించిన వివరాలేవీ తెలియరాలేదు.(చదవండి: జియోపై ఎయిర్‌టెల్ పైచేయి)
శాంసంగ్ ఏ72 ధర
ఈ ఫోన్ ఇప్పటికే పలు సర్టిఫికేషన్ సైట్లలో కనిపించింది. ఈ ఫోన్ ధర కూడా ఆన్లైన్‌లో లీకైంది. ఈ ఫోన్ కొన్ని మార్కెట్లలో 4జీతో, కొన్ని మార్కెట్లలో 5జీతో రానుంది. కొన్ని మార్కెట్లలో రెండు వేరియంట్లూ రానున్నట్లు తెలుస్తోంది. 6 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన 4జీ వేరియంట్ ధర 449 యూరోలుగానూ(సుమారు రూ.39,800), 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ఉన్న 4జీ వేరియంట్ ధర 509 యూరోలుగానూ(సుమారు రూ.45,100) ఉండనున్నట్లు సమాచారం. ఇక శాంసంగ్ గెలాక్సీ ఏ72 5జీ ధర 600 డాలర్లుగా(సుమారు రూ.43,800) ఉండనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన లాంచ్ కూడా వచ్చే నెలలో జరగనుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment