
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మొబైల్ తయారీదారులు తమ యూజర్లకు మరిన్ని బెటర్ ఫీచర్లు అందించేలా కృషి చేస్తున్నాయి. అందులో భాగంగా డిస్‌ప్లే పరిమాణం, ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజీలో మార్పులు తీసుకొస్తున్నాయి. ప్రధానంగా వివిధ మెగాపిక్సెల్ కెమెరాలతో మొబైళ్లను మార్కెట్‌లో విడుదల చేస్తున్నాయి. బేసిక్ బడ్జెట్ ఫోన్ల కంటే కూడా యువత ఎక్కువగా అధిక ఫీచర్లు ఉండే ఫోన్లనే ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.30వేలలోపు అందుబాటులో ఉన్న వివిధ కంపెనీలకు చెందిన ఫోన్లు ఏమిటో తెలుసుకుందాం. వీటి ధర ఆన్‌లైన్ ఈకామర్స్, రిటైల్ ప్లాట్‌ఫామ్‌లను బట్టి స్వల్పంగా మారుతోంది. గమనించగలరు.

నథింగ్ ఫోన్ (2ఏ) 5జీ , ధర: 25,899 , బ్యాక్ కెమెరా 50, 2, ఫ్రంట్‌లో 32 మెగాపిక్సల్ కెమెరా. 6.7 అంగుళాల స్క్రీన్. 12జీబీ ర్యామ్. 128జీబీ ఇంటర్న్‌ల్ మెమోరీ.

ఐకూ జెడ్7 ప్రో 5జీ, ధర: 24,999 , బ్యాక్ 64, 2 మెగాపిక్సెల్, ఫ్రంట్‌లో 16 మెగాపిక్సల్ కెమెరాలు. 6.78 అంగుళాల ఎమోలెడ్ స్క్రీన్. 8జీబీ ర్యామ్. 256జీబీ స్టోరేజీ.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్‌ఈ 5జీ, ధర: 26,999 , బ్యాక్‌లో 12, 8, 12 ఎంపీ కెమెరా. ఫ్రంట్‌లో 32 మెగాపిక్సల్ కెమెరా. 6.5 అంగుళాల ఎమోలెడ్ స్క్రీన్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ.

వన్‌ప్లస్ నార్డ్ 3 5జీ, ధర 24,649. రీర్ 50, 8, 2 ఎంపీ కెమెరా. ఫ్రంట్‌లో 16 మెగాపిక్సల్ కెమెరా. 6.74 అంగుళాల ఎమోలెడ్ స్క్రీన్. 8 జీబీ ర్యామ్. 128 జీబీ స్టోరేజీ.

రియల్‌మీ 11 ప్రో 5జీ , ధర: 29,999, బ్యాక్‌లో 200, 8, 2 ఎంపీ కెమెరా. ఫ్రంట్‌లో 32 మెగాపిక్సల్ కెమెరా. 6.7 అంగుళాల కర్వ్‌డ్ విజన్ స్క్రీన్. 12 జీబీ ర్యామ్. 256 జీబీ స్టోరేజీ.

రెడ్‌మీ నోట్ 12 ప్రో 5జీ, ధర: 23,499. బ్యాక్‌లో 50, 8, 2, ఫ్రంట్‌లో 16 మెగాపిక్సల్ కెమెరాలు. 6.67 అంగుళాల ఎమోలెడ్ స్క్రీన్. 8 జీబీ ర్యామ్. 256 జీబీ స్టోరేజీ.

ఒప్పో ఎఫ్25 ప్రో 5జీ , ధర: 25,999. బ్యాక్‌లో 64, 8, 2 మెగాపిక్సల్ కెమెరా. ఫ్రంట్‌లో 32 మెగాపిక్సల్ కెమెరా. 6.7 అంగుళాల ఎమోలెడ్ స్క్రీన్ 8 జీబీ ర్యామ్. 256 జీబీ స్టోరేజీ.

హానర్ 90, ధర: 27,995, బ్యాక్‌లో 200, 12, 2 ఎంపీ కెమెరా. ఫ్రంట్‌లో 50 మెగాపిక్సల్ కెమెరా. 6.7 అంగుళాల ఎమోలెడ్ స్క్రీన్. 12 జీబీ ర్యామ్. 512 జీబీ స్టోరేజీ.

షియామీ 11 లైట్ ఎన్‌ఈ 5జీ, ధర: 24,990, బ్యాక్‌లో 64, 8, 5 ఎంపీ కెమెరా. ఫ్రంట్‌లో 20 మెగాపిక్సల్ కెమెరా. 6.55 అంగుళాల ఎమోలెడ్ స్క్రీన్. 6 జీబీ ర్యామ్. 128 జీబీ స్టోరేజీ.