ఆపిల్ ఐఫోన్ 12 లాంచ్ అయ్యి కొద్దీ నెలలు అయిందో లేదో అపుడే ఆపిల్ ఐఫోన్13పై పలు పుకార్లు వైరల్ అవుతున్నాయి. ఇంకా ఈ ఫోన్ విడుదలకు ఏడాది సమయం ఉన్న తాజాగా ఐఫోన్13లో రాబోయే ఫీచర్స్ గురుంచి అనేక రూమర్లు వస్తున్నాయి. ఇటీవల ఒక టిప్‌స్టర్ జాన్ ప్రాసెసర్ తెలిపిన వివరాల ప్రకారం, ఐఫోన్ 13 సిరీస్‌లో టచ్‌ఐడి అనే ఫింగర్ ప్రింట్ సెన్సార్ సాంకేతికతను తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఇంకో పెద్ద ట్విస్ట్ ఏమిటంటే, ఐఫోన్ 13 యొక్క టచ్ఐడి సెన్సార్ మునుపటిలాగా స్క్రీన్ దిగువన క్రింద కాకూండా ఈ సారి డిస్ప్లే కింద తీసుకువస్తున్నట్లు సమాచారం. ఇదివరకే ఈ టెక్నాలజీని మీరు శామ్‌సంగ్, వివో, ఒప్పోతోపాటు ఇతర ఫోన్లలో చూసి ఉండవచ్చు. అలాగే కొత్త ఆపిల్ ఐప్యాడ్ ఎయిర్‌లో ఇప్పటికే ఉన్న టెక్, పవర్ బటన్‌పై టచ్‌ఐడిని తీసుకురావడానికి అవకాశం ఉంది.(చదవండి: స్మార్ట్‌ఫోన్‌లతో జర జాగ్రత్త)
Comments
Please login to add a commentAdd a comment