యాపిల్ కంపెనీ తన 'ఐఫోన్ ఎస్ఈ' 2017లో భారతదేశంలో ఉత్పత్తిని ప్రారంభించింది. అప్పటి నుంచి ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 15 వంటివన్నీ మన దేశంలోనే తయారయ్యాయి. అయితే కంపెనీ ఇప్పటి వరకు ఇండియాలో ఎప్పుడూ ప్రో వేరియంట్‌లను తయారు చేయలేదు. ఇప్పుడు మొదటిసారి ఐఫోన్ 16 ప్రో మోడల్ తయారు చేయనున్నట్లు సమాచారం.
యాపిల్ కంపెనీ ప్రో మోడల్ మొబైల్స్ తయారు చేయనున్నట్లు చెప్పడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో కూడా యాపిల్ భారతదేశంలో ఐఫోన్ 16 ప్రో & ఐఫోన్ 16 ప్రో మాక్స్ మోడల్‌ల తయారీని ప్రారంభించాలని యోచిస్తోందని పేర్కొంది. ప్రారంభంలో ఎంట్రీ-లెవల్, పాత ఐఫోన్ మోడళ్లపై దృష్టి సారించిన కంపెనీ క్రమంగా అప్డేటెడ్ మోడల్స్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది.
వచ్చే 3 - 4 సంవత్సరాలలో దేశంలో మొత్తం ఐఫోన్ ఉత్పత్తిలో 25 శాతం లక్ష్యంగా, యాపిల్ తన ప్రపంచ ఉత్పత్తిలో భారతదేశ వాటాను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే 16 ప్రో మోడల్స్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. స్థానిక ఉత్పత్తిని ప్రపంచవ్యాప్త విడుదలతో సమకాలీకరించాలనే లక్ష్యంతో ఫాక్స్‌కాన్ ఇప్పటికే తమిళనాడులోని తన సదుపాయంలో వేలాది మంది కార్మికులకు శిక్షణ ఇవ్వడం కూడా ప్రారంభించింది. దీన్ని బట్టి చూస్తుంటే కంపెనీ తన లక్ష్యాన్ని వేగంగా చేరుకుంటుందని స్పష్టంగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment