చైనా: వివో చైనాలో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. వివో వై30 స్టాండర్డ్ ఎడిషన్ అని పిలువబడే ఈ మొబైల్ జూలైలో భారతదేశంలో లాంచ్ అయిన వివో వై30 యొక్క డౌన్గ్రేడ్ వెర్షన్ అని తెలుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం ఒక్క వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంది. చైనాలో వివో వై 30 ధర 1,398యువాన్లు(సుమారు రూ.15,700)గా నిర్ణయించబడింది.(చదవండి: పదకొండు వేలకే రెడ్‌మీ 9 పవర్)
వివో వై 30 ఫీచర్స్:
వివో వై 30 స్టాండర్డ్ ఎడిషన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్ పై నడుస్తుంది. ఇందులో పవర్‌వీఆర్ జీఇ8320 జీపీయును తీసుకొచ్చింది. దీనిలో 6జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. ఈ మొబైల్ లో మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 256జీబీ వరకు విస్తరించవచ్చు. ఇది 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. రెగ్యులర్ వివో వై 30 మాదిరిగానే వివో వై 30 స్టాండర్డ్ ఎడిషన్ 6.5-అంగుళాల ఐపీఎస్ ఎల్‌సిడి ప్యానల్‌తో వస్తుంది. ఇది 720 x 1600 రిజల్యూషన్ కలిగి ఉంది. ఇందులో వివో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. వివో వై 30 స్టాండర్డ్ ఎడిషన్ లో 13మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2మెగాపిక్సల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 8మెగాపిక్సల్ కెమెరా ఉంది. కనెక్టివిటీ విషయానికొస్తే 4జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, జిపిఎస్, గ్లోనాస్, యుఎస్‌బి ఒటిజి, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌ను అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment