ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ రియల్‌మీ చాలా తక్కువ ధరకే ట్రిపుల్ రియర్ కెమెరా స్మార్ట్‌ఫోన్ సీ21వైను నేడు(ఆగస్టు 23) మనదేశంలో లాంచ్ చేసింది. ఈ కొత్త రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ 20:9 డిస్ ప్లేతో వస్తుంది. ఈ సీ21వై స్మార్ట్‌ఫోన్ 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీని కూడా కలిగి ఉంది. అలాగే ఇది రివర్స్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. దీనిలో స్లో-మోషన్ వీడియోను(1080పీ) వరకు వీడియో రికార్డింగ్ చేయవచ్చు. మొత్తం మీద రియల్‌మీ సీ21వై రెడ్ మీ 9, ఇన్ఫినిక్స్ హాట్ 10ఎస్, నోకియా జీ20 వంటి బడ్జెట్ ఫోన్లతో పోటీ పడనుంది.
భారతదేశంలో రియల్‌మీ సీ21వై 3జీబీ/32జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.8,999, 4/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.9,999గా ఉంది. ఈ ఫోన్ క్రాస్ బ్లాక్, క్రాస్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్, రియల్‌మీ పోర్టల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇంకా ఆఫ్ లైన్ రిటైలర్ స్టోర్లలో కూడా కొనుగోలుకు అందుబాటులో ఉంది.(చదవండి: రైల్వే రిజర్వేషన్ టికెట్ బదిలీ చేసుకోవచ్చు ఇలా..!)
రియల్‌మీ సీ21వై స్పెసిఫికేషన్స్:
- 6.5 అంగుళాల హెచ్ డి+ డిస్ ప్లే
- ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యుఐ
- యునిసోక్ టీ610 ఆక్టా కోర్ ప్రాసెసర్
- 13 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ మోనోక్రోమ్ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా
- 5 మెగాపిక్సెల్ కెమెరా(ఎఫ్/2.4 లెన్స్)
- 3/32 జీబీ, 4/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్
- 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ (రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్)
- 4జీ ఎల్ టీఈ, వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్ వి5.0, జీపిఎస్/ ఎ-జిపిఎస్, మైక్రో-యుఎస్ బి, 3.5మిమి హెడ్ ఫోన్ జాక్ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment