
న్యూఢిల్లీ: షియోమీ ఎంఐ 10ఐ ఈ రోజు భారతదేశంలో అమ్మకానికి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ప్రైమ్ సభ్యులకు జనవరి 7నే అందుబాటులో ఉంది. షియోమీ ఈ వారం మొదట్లో ఎంఐ 10ఐని విడుదల చేసింది. ఎంఐ 10ఐ అమెజాన్ ఇండియా, ఎంఐ.కామ్‌లో ఈ రోజు మధ్యాహ్నం 12గంటలకు అందుబాటులోకి వచ్చింది. ఎంఐ 10ఐ యొక్క 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.20,999. 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999, అలాగే 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.23,999గా ఉంది. ఎంఐ 10ఐ పసిఫిక్ సన్‌రైజ్, అట్లాంటిక్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్ వంటి మూడు రంగులలో లభిస్తుంది.(చదవండి: శామ్‌సంగ్: ఒకటి కొంటే ఒకటి ఫ్రీ)
ఎంఐ 10ఐ స్పెసిఫికేషన్స్:
డిస్‌ప్లే: 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే(120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్)
ర్యామ్: 6జీబీ, 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్
రియర్ కెమెరా: 108ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ+ 2ఎంపీ
సెల్ఫీ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,820 ఎంఏహెచ్(33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కనెక్టివిటీ: 5జీ, 4జీ, డ్యూయల్ వోఎల్‌టిఇ, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, బ్లూటూత్ 5.1, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్
ధర: రూ.20,999-23,999
Comments
Please login to add a commentAdd a comment