షియోమీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నా ఎంఐ 11ను గ్లోబల్ మార్కెట్లో 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో విడుదల చేసింది. షియోమీ ఎంఐ 11 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ చేత పనిచేయనుంది. అవుట్-ఆఫ్-ది-బాక్స్ ఎంఐయూఐ 12.5 ఓఎస్ తో పనిచేస్తుంది. ఎంఐ 11 మొబైల్ ఇండియా లాంచ్‌కు సంబంధించిన వివరాలను షియోమీ ఇంకా వెల్లడించలేదు. షియోమీ ఎంఐ 11ను గత ఏడాది డిసెంబర్‌లో చైనాలో విడుదల చేశారు.
షియోమీ ఎంఐ 11 ఫీచర్స్:
డిస్‌ప్లే: 6.81-అంగుళాల 2కే డబ్ల్యూక్యూహెచ్‌డి అమోలెడ్
రిఫ్రెష్ రేట్: 120హెర్ట్జ్
బ్యాటరీ: 4,600 ఎమ్ఏహెచ్
ఫాస్ట్ ఛార్జింగ్: 55 డబ్ల్యూ వైర్డ్, 50 డబ్ల్యూ వైర్‌లెస్
ర్యామ్: 8జీబీ LPDDR5
స్టోరేజ్: 128జీబీ, 256జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 888
బ్యాక్ కెమెరా: 108ఎంపీ(ఎఫ్/1.85) + 13ఎంపీ(ఎఫ్/2.4) + 5ఎంపీ
సెల్ఫీ కెమెరా: 20 ఎంపీ
ఆండ్రాయిడ్ ఓఎస్: ఎంఐయూఐ 12.5
కలర్స్: హారిజన్ బ్లూ, మిడ్ నైట్ గ్రే, క్లౌడ్ వైట్
కనెక్టివిటీ: 5జీ, 4జీ ఎల్‌టిఇ, వై-ఫై 6ఇ, బ్లూటూత్ 5.2
ఎంఐ 11 ధర:
ఎంఐ 11 8జీబీ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర యూరో 749(సుమారు రూ.65,800)గా నిర్ణయించగా, 8జీబీ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర యూరో 799(సుమారు రూ.70,100)గా ఉంది. ఫోన్ క్లౌడ్ వైట్, హారిజోన్ బ్లూ, మిడ్నైట్ గ్రే కలర్ ఆప్షన్లలో వస్తుంది. దీనికి రెండు సంవత్సరాల వారంటీ లభిస్తుంది.
చదవండి: వాట్సాప్‌ను వెనక్కి నెట్టేసిన టెలిగ్రాం
నోకియా 5.4ను టీజ్ చేసిన ఫ్లిప్‌కార్ట్
Comments
Please login to add a commentAdd a comment