చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ తన మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచ మార్కెట్ లో ఎంఐ మిక్స్ పేరుతో విడుదల చేసింది. ఇది టాప్-ఆఫ్-లైన్ స్పెసిఫికేషన్లతో నో-బెజెల్ స్మార్ట్‌ఫోన్. ఫోల్డబుల్ డిస్ ప్లే మాత్రమే కాకుండా షియోమీ ఎంఐ మిక్స్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లో108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్స్ తో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో మూడు వేరియంట్లలో తీసుకొచ్చారు. ఈ రోజు నుంచి చైనాలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త ఫోన్ శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2, హువావే మేట్ ఎక్స్ 2లతో పోటీ పడనుంది. దీనిని మన దేశంలో ఎప్పుడు తీసుకొస్తారు అనే దానిపై స్పష్టత లేదు.
ఎంఐ మిక్స్ ఫోల్డ్ 6.52-అంగుళాల అమోలేడ్ ప్యానల్‌తో 840 x 2,520 పీఎక్స్ రిజల్యూషన్‌తో బయట వస్తుంది. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ తెరిచినప్పుడు పెద్ద స్క్రీన్ 4: 3 నిష్పత్తిలో 1440పీ రిజల్యూషన్‌తో 8.01-అంగుళాల ఓఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది. ఇప్పటి వరకు తీసుకొచ్చిన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లలో ఇదే అతిపెద్ద డిస్ప్లే అని కంపెనీ పేర్కొంది. ఓఎల్ఈడి ప్యానెల్ హెచ్డిఆర్10 ప్లస్, డాల్బీ విజన్‌కు సపోర్ట్ చేస్తుంది. ఎంఐ మిక్స్ ఫోల్డ్ చేస్తే 6.5-అంగుళాల డిస్ప్లే 27: 9 నిష్పత్తితో, 90హెర్ట్జ్ కంటే ఎక్కువ రిఫ్రెష్ రేటు కలిగి ఉంది.
ఇది 12జీబీ, 16జీబీ ర్యామ్ ఎంపికలతో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 108 ఎంపీ ప్రైమరీ కెమెరా (శామ్‌సంగ్ హెచ్‌ఎం 2 సెన్సార్), లిక్విడ్ లెన్స్ టెక్నాలజీతో 8 ఎంపీ సెకండరీ కెమెరా అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో 13 ఎంపీ కెమెరా(ఎఫ్/2.4) ఉన్నాయి. ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్ కూడా ఉంది. 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే డ్యూయల్ సెల్ 5,020 ఎంఏహెచ్ బ్యాటరీని అందించింది. 37 నిమిషాల్లో ఫోన్‌ను ఫుల్ ఛార్జ్ చేయవచ్చు అని కంపెనీ పేర్కొంది. ఎంఐ మిక్స్ ఫోల్డ్‌లో క్వాడ్ స్పీకర్లు కూడా ఉన్నాయి. ఇవి హర్మాన్ కార్డాన్ చేత ట్యూన్ చేయబడతాయి.ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయుఐ 12తో నడుస్తుంది. ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే 5జీ, 4జీ ఎల్‌టిఇ, వై-ఫై 6, బ్లూటూత్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
ఎంఐ మిక్స్ ఫోల్డ్ ఫీచర్స్:
- 6.52-అంగుళాల అమోలేడ్ ప్యానల్
- స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్
- 108 ఎంపీ ప్రైమరీ కెమెరా(శామ్‌సంగ్ హెచ్‌ఎం 2 సెన్సార్)
- 08 ఎంపీ సెకండరీ కెమెరా
- 13 ఎంపీ కెమెరా(ఎఫ్/2.4)
- 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
- 5,020 ఎంఏహెచ్ బ్యాటరీ
- 67వాట్ ఫాస్ట్ ఛార్జర్
- ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయుఐ 12 ఓఎస్
- సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
- 12 జీబీ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర: సుమారు రూ.1,12,100
- 12 జీబీ + 512 జీబీ స్టోరేజ్ మోడల్ ధర: సుమారు రూ.1,23,300
- 16 జీబీ + 512 జీబీ స్టోరేజ్ మోడల్ ధర: సుమారు రూ.1,45,700
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment