Touch Mobiles Independence Day Offer Free Phone - Sakshi
Sakshi News home page

Free Phone Offer: ఆగస్టు నెలలో పుట్టారా? అయితే ఫోన్‌ ఫ్రీ!

Published Tue, Aug 15 2023 7:14 AM | Last Updated on Sun, Aug 20 2023 5:45 PM

touch mobiles independence day offer free phone - Sakshi

హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మొబైల్‌ రిటైల్‌ చెయిన్‌ సంస్థ టచ్‌ మొబైల్స్‌ ‘ఫ్రీ ఫోన్‌’ ఆఫర్‌ ప్రకటించింది. 1947 ఆగస్టు నెలలో జన్మించిన వారికి మొబైల్‌ ఉచితంగా ఇస్తుంది.

ఇండిపెండెన్స్‌ డే రోజున టచ్‌ స్టోర్‌ను సందర్శించి తమ ఆధార్‌ కార్డులోని పుట్టిన తేదీని చూపించి ఎలాంటి చార్జీలు లేకుండా ఫ్రీగా మొబైల్‌ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌ ఆగస్టు 15 ఒక్క రోజుకే పరిమితం. అలాగే బ్రాండెడ్‌ ఫోన్లపై 50%, యాక్ససరీస్‌లపై 77% వరకు తగ్గింపు అందిస్తుంది.

ఒప్పో అన్ని మోడళ్లపై 15% వరకు క్యాష్‌ బ్యాక్‌ పొందవచ్చు. ప్రారంభ ధర రూ.6,999తో 32 అంగుళాల ఎల్‌ఈడీ టీవీని అందిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రిడిట్‌ కార్డులపై 10% తక్షణ క్యాష్‌ బ్యాక్‌ పొందవచ్చు. సున్నా వడ్డీతో సులభ వాయిదా పద్ధతిలో అధునాతన మోడల్స్‌ పొందే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement