free phones
-
ఆగస్టు నెలలో పుట్టారా? అయితే ఫోన్ ఫ్రీ!
హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మొబైల్ రిటైల్ చెయిన్ సంస్థ టచ్ మొబైల్స్ ‘ఫ్రీ ఫోన్’ ఆఫర్ ప్రకటించింది. 1947 ఆగస్టు నెలలో జన్మించిన వారికి మొబైల్ ఉచితంగా ఇస్తుంది. ఇండిపెండెన్స్ డే రోజున టచ్ స్టోర్‌ను సందర్శించి తమ ఆధార్ కార్డులోని పుట్టిన తేదీని చూపించి ఎలాంటి చార్జీలు లేకుండా ఫ్రీగా మొబైల్ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఆగస్టు 15 ఒక్క రోజుకే పరిమితం. అలాగే బ్రాండెడ్ ఫోన్లపై 50%, యాక్ససరీస్‌లపై 77% వరకు తగ్గింపు అందిస్తుంది. ఒప్పో అన్ని మోడళ్లపై 15% వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ప్రారంభ ధర రూ.6,999తో 32 అంగుళాల ఎల్ఈడీ టీవీని అందిస్తుంది. హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రిడిట్ కార్డులపై 10% తక్షణ క్యాష్ బ్యాక్ పొందవచ్చు. సున్నా వడ్డీతో సులభ వాయిదా పద్ధతిలో అధునాతన మోడల్స్ పొందే అవకాశం ఉంది. -
హైవేపై ఫ్రీ ఫోన్లు
యడ్లపాడు: ఇకపై జాతీయ రహదారిపై అర్ధరాత్రి ప్రమాదం జరిగినా.. ఆ ప్రమాదంలో బాధితుల ఫోన్లు ధ్వంసమైనా వెంటనే హైవే నిఘా విభాగానికి సులువుగా సమాచారం అందించవచ్చు. ఇందుకోసం గుంటూరు జిల్లాలోని హైవే మార్గంలో ప్రతి కిలోమీటరుకు ఒక టెలిఫోన్‌తోపాటు వీడియో కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే టెలిఫోన్ వద్దకు వెళ్లి రెడ్ బటన్ నొక్కితే వెంటనే మంగళగిరిలోని టోల్‌ప్లాజాలో నిఘా విభాగానికి సమాచారం అందుతుంది. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కోడ్ ద్వారా తెలుసుకుని అక్కడికి సమీపంలోని పెట్రోలింగ్ వాహనాన్ని లేదా క్రేన్లను పంపిస్తారు. రోడ్డు ప్రమాదాలను తెలుసుకుని సత్వరమే బాధితులకు వైద్య సహాయం అందించేందుకు వీటిని ఏర్పాటు చేసినట్లు హైవే అధికారులు చెప్పారు. 24 గంటలు అందుబాటులో ఉండే ఈ ఫోన్, వీడియోల పనితీరును టోల్‌ప్లాజా కంట్రోల్ రూం సిబ్బంది పరిశీలిస్తున్నారు. కాజ టోల్ ప్లాజా పరిధిలో జాతీయ రహదారి పక్కన కిలోమీటరుకు ఒకటి చొప్పున యడ్లపాడు వరకు 60 ఫోన్లు, వీడియో కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇవి రెండురోజుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.