గెలాక్సీ ఎస్ 21 టీజర్‌ విడుదల | Samsung Releases First official Galaxy S21 Teaser | Sakshi
Sakshi News home page

గెలాక్సీ ఎస్ 21 టీజర్‌ విడుదల

Published Fri, Jan 1 2021 6:31 PM | Last Updated on Fri, Jan 1 2021 6:44 PM

Samsung Releases First official Galaxy S21 Teaser - Sakshi

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 మొబైల్ ను తీసుకొస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా గెలాక్సీ ఎస్ 21కు సంబందించిన టీజర్‌ను శామ్‌సంగ్ యూట్యూబ్ లో షేర్ చేసింది. ఈ వీడియోలో ఎక్కడ కూడా గెలాక్సీ ఎస్ 21 పేరు ప్రస్తావించకుండా ఒక హింట్ మాత్రం ఇచ్చింది. అలాగే విడుదల తేదీ గురుంచి ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ గత లీక్‌ల ప్రకారం జనవరి రెండవ వారంలో తీసుకురానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మొబైల్ కి సంబందించిన ఫీచర్స్ ఆన్లైన్ లో లీక్ అయ్యాయి. ఎస్ 20 మాదిరిగానే గెలాక్సీ ఎస్ 21 ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేతో రానున్నట్లు తెలుస్తుంది. (చదవండి: 2021లో రాబోయే బెస్ట్ 10 స్మార్ట్‌ఫోన్స్)
 

గెలాక్సీ ఎస్ 21 ఫీచర్స్ 
గెలాక్సీ ఎస్ 21 ప్లస్ డ్యూయల్ సిమ్(నానో) సపోర్ట్ తో రానుంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యుఐ 3.1పై పని చేయనున్నాయి. ఈ మొబైల్స్ ప్రాంతాన్ని బట్టి శామ్‌సంగ్ ఎక్సినోస్ 2100 ప్రాసెసర్ లేదా స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో రానుంది. గెలాక్సీ ఎస్ 21 8 జీబీ ర్యామ్‌ను స్టాండర్డ్‌గా కలిగి ఉండగా 128 జీబీ, 256 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ లలో లభించనుంది. డిస్‌ప్లే విషయానికి వస్తే శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21లో 6.2-అంగుళాల ఫుల్-హెచ్‌డి ప్లస్(1,080x2,400 పిక్సెల్స్) ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేతో రానున్నట్లు పేర్కొంది. ఇందులో 64 మెగాపిక్సెల్ టెలిఫోటో ఎఫ్/2.0 లెన్స్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ అల్ట్రా-వైడ్ యాంగిల్ ఎఫ్/2.2 కెమెరా, వైడ్ యాంగిల్ ఎఫ్/1.8 లెన్స్‌తో 12 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. బ్యాటరీ పరంగా గెలాక్సీ ఎస్ 21 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఫాస్ట్ వైర్డ్, వైర్‌లెస్ ఛార్జింగ్ రెండింటికి సపోర్ట్ చేయనుంది. కనెక్టివీటి కోసం బ్లూటూత్ వీ5, యుఎస్బీ టైప్ సి పోర్ట్, ఎన్ఎఫ్సి, వై-ఫై 6 ఉన్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement