జనవరిలో రానున్న ఐక్యూ 7 మొబైల్  | iQOO 7 Tipped to Launch by Mid January | Sakshi
Sakshi News home page

జనవరిలో రానున్న ఐక్యూ 7 మొబైల్ 

Published Mon, Dec 21 2020 6:54 PM | Last Updated on Mon, Dec 21 2020 6:58 PM

iQOO 7 Tipped to Launch by Mid January - Sakshi

చైనా: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూ రాబోయే ఐక్యూ 7 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ చైనాలో లాంచ్ చేయడానికి సిద్దమవుతుంది. ఈ ఏడాదిలో తీసుకొచ్చిన ఐక్యూ 5 సిరీస్ తదుపరి వెర్షన్ గా ఈ ఫోన్ ని తీసుకొస్తున్నారు.  దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా కంపెనీ ఇప్పటికే ధ్రువీకరించింది. అంతేకాకుండా అధికారిక గేమింగ్ మొబైల్ కూడా ఇదేనని ప్రకటించింది. ఇప్పటివరకు వచ్చిన సమాచారం మేరకు ఐక్యూ 7 వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉండనుంది. దాని కింద ఐక్యూ బ్రాండింగ్ ఉండనున్నాయి. ఈ ఫోన్ వెనుకవైపు రెడ్, బ్లూ, బ్లాక్ రంగుల డిజైన్ కూడా ఉండనుంది. ఫ్లాగ్ షిప్ మొబైల్ స్పెసిఫికేషన్స్ తో ఇది విడుదల కానుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తీసుకు రానున్నట్లు సమాచారం. ఈ ఫోన్‌లో 120వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా తీసుకురానున్నట్లు 3సీ సర్టిఫికేషన్ ద్వారా మనకు తెలుస్తుంది. వచ్చే ఏడాది జనవరిలో దీనిని తీసుకు రానున్నట్లు ఒక టిప్ స్టార్ ప్రకటించారు. (చదవండి: 5000లు పెడితే రోజుకు 500 వస్తాయనే ఆశతో..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement