
ఆపిల్ కంపెనీ ఐఫోన్ 12 సిరీస్ ఫోన్‌లను విడుదల చేసి కొద్దీ కాలమే అయినప్పటికీ, అప్పుడే ఆపిల్ తర్వాత తీసుకురాబోయే ఐఫోన్ 13 గురించి కొన్ని రూమర్లు బయటకి వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం ఐఫోన్ 13 సిరీస్ టాప్- ఎండ్ మోడళ్లలో 120హెర్ట్జ్ ఎల్‌టిపిఓ డిస్‌ప్లే తీసుకురానున్నట్లు సమాచారం. ఈ ఐఫోన్ 13 ప్యానెల్స్ కోసం సామ్‌సంగ్ డిస్‌ప్లే, ఎల్‌జీ డిస్‌ప్లే ప్రధాన సరఫరాదారులను సంప్రదించినట్లు సమాచారం. కొరియన్ నివేదిక ప్రకారం, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్ వేరియంట్లలో 120హెర్ట్జ్ ఎల్‌టిపిఓ ప్రోమోషన్ డిస్‌ప్లేను కలిగి ఉండనున్నాయి. బేస్ వేరియంట్లు అయిన ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ఎల్‌టిపిఎస్ డిస్‌ప్లేతో వస్తాయని పేర్కొన్నారు. పైన తెలిపినట్లు ప్రో వేరియంట్లు 120 హెర్ట్జ్ ఎల్‌టిపిఓ డిస్‌ప్లేను కలిగి ఉంటాయని సూచించారు. అయితే, వచ్చే ఏడాది అన్ని ఐఫోన్‌లను వైర్‌లెస్‌గా మార్చడానికి ఆపిల్ ప్రణాళిక వేస్తున్నట్లు టిప్‌స్టర్ జోన్ ప్రాసెసర్ పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం ప్రాసెసర్ ఆపిల్ ప్రస్తుతం ఫోల్డబుల్ ఫోన్ ని తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబందించిన వీడియోను తన యూట్యూబ్ లో షేర్ చేసారు.(చదవండి: ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తుంది!)
Comments
Please login to add a commentAdd a comment