Chhavi Mittal About Her First Radiation Therapy Experience: ప్రముఖ టీవీ నటి ఛవి మిట్టల్ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. గత నెల తాను క్యాన్సర్ బారిన పడినట్లు ప్రకటించిన ఆమె ఏమాత్రం బాధపడకుండా తనలాంటి మరికొందరికి సోషల్ మీడియా వేదికగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల రొమ్ము క్యాన్సర్‌కు సర్జరీ చేయించుకున్న ఆమె ఈ రోజు తొలి రేడియేషన్ థెరపీ చేయించుకున్నట్లు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె తొలి రేడియేషన్ థెరపీ అనుభవాన్ని పంచుకుంది.
చదవండి: విజయ్, సమంతలకు థ్యాంక్స్ అంటూ డైరెక్టర్ లేటెస్ట్ అప్‌డేట్!
‘నా రేడియేషన్ థెరపీ ఈ రోజే మొదలైంది. దీనికి ముందు ఈ రేడియేషన్ ప్రభావం ఎలా ఉంటుందని కొందరితో చర్చించాను. దీని వల్ల కొన్ని దుష్ప్రభావాలు కనిపిస్తాయని, వాటితో అంత సౌకర్యంగా ఉండకపోవచ్చని నాకు చెప్పారు. కీమో లేదా రేడియోథెరపీ అన్నది పేషెంట్ ఎంపికే అని చాలా మంది అన్నారు. సాంకేతికంగా అనుమతి పత్రంపై సంతకం చేయడమే మనం చేయాల్సింది. మొత్తానికి చికిత్స ఏంటన్నది మీ డాక్టర్ నిర్ణయించాల్సిందే. డాక్టర్ దృష్టి మన ప్రాణాలు కాపాడడంపైనే కానీ, మన సైడ్ ఎఫెక్ట్స్‌ను దూరం చేయడంపై కాదు’ ఆమె రాసుకొచ్చింది.
చదవండి: భర్తతో హీరోయిన్ బేబీ బంప్ ఫొటోలు, వైరల్
‘అయితే నేను కేవలం జీవించాలనుకోవడం లేదు. నా లైఫ్‌ని సంతోషంగా గడపాలనుకుంటున్నా. ఎలాగు సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తప్పించుకోలేను. అందుకే రేడియేషన్ వల్ల వచ్చే దుష్ప్రభావాలను గురించి పట్టించుకోవాలని అనుకోవడం లేదు. ఇక ఈ జర్నీలో నాకు సహాకరిస్తూ వెన్నంటే ఉంటున్న నా డాక్టర్లకు కృతజ్ఞతలు. ఈ రేడియేషన్ థెరపీ అనేది 4 నెలల పాటు వారానికి లేదా 5 రోజుల చొప్పున 20 సైకిల్స్‌గా ఇవ్వనున్నారు’ అని ఛవి మిట్టల్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment