
హిందీ సీరియల్స్‌తో పాపులారిటీ దక్కించుకుంది ఛవి మిట్టల్. తాజాగా ఛవి మిట్టల్ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇటీవల జిమ్‌లో వర్క్‌అవుట్ చేస్తుండగా ఛవి గాయపడింది. వెంటనే డాక్టర్‌లను సంప్రదించగా రొమ్ములో కణితి ఉందని గుర్తించారు.
Actress Chhavi Mittal Suffering With Breast Cancer: హిందీ సీరియల్స్‌తో పాపులారిటీ దక్కించుకుంది ఛవి మిట్టల్. తాజాగా ఛవి మిట్టల్ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇటీవల జిమ్‌లో వర్క్‌అవుట్ చేస్తుండగా ఛవి గాయపడింది. వెంటనే డాక్టర్‌లను సంప్రదించగా రొమ్ములో కణితి ఉందని గుర్తించారు. అనంతరం పరీక్షలు నిర్వహించగా బ్రెస్ట్ క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. త్వరలో సర్జరీ చేయించుకోనుంది ఛవి మిట్టల్. అయితే ఇలాంటి క్యాన్సర్ బారిన పడితే సాధారణంగా ఎవరైనా భయపడుతారు. కానీ ఛవి మాత్రం ఈ విషయం తెలిసినప్పటినుంచి తనలా బాధపడుతున్న మరెంతో మందికి రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తోంది. అలాగే తనకు క్యాన్సర్ అనే విషయాన్ని చెబుతూ ఎమోషనల్‌గా పోస్ట్ పెట్టింది.
'డియర్ బ్రెస్ట్స్.. ఇది మీకు అభినందనల పోస్ట్. మీ మ్యాజిక్ ఏంటో మీరు నాకు ఎనలేని ఆనందాన్ని ఇచ్చినప్పుడు నేను తొలిసారి గమనించాను. ఈరోజు మీలో ఒకరు క్యాన్సర్‌తో పోరాడినప్పుడు మీకు అండగా ఉండటం నా వంతు. ఇలా జరగడం గొప్పేమి కాదు గానీ విచారించాల్సిన అవసరం లేదు. ఇది సులభమైనదేం కాదు. అలా అని కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు. నేను మళ్లీ అదే విధంగా కనిపించకపోవచ్చు. అలాగే కచ్చితంగా నాకు భిన్నమైన అనుభూతి కలగదు. బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడి గెలిచి వారందరి నుంచి నేను ఎంతో స్ఫూర్తి పొందుతున్నానో మీకు తెలియదు. అలాగే, మీలో ఇప్పటికే తెలిసిన వారికి, ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు చేసే ప్రతీ కాల్‌కి, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.' అంటూ రాసుకొచ్చింది ఛవి మిట్టల్. 41 ఏళ్ల మొహీత్ హుస్సేన్‌ను వివాహం చేసుకుంది ఛవి మిట్టల్. వారికి అర్హమ్ అనే కుమారుడు, అరీజా అనే కుమార్తె ఉన్నారు.