రేడియేషన్ బారి నుంచి తప్పించేందుకు శాస్త్రవేత్తలు కొత్త పదార్థాన్ని అభివృద్ధిపరిచారు.
సియోల్: మొబైల్ ఫోన్లు, టీవీలు, మైక్రోవేవ్ వంటి పరికరాల నుంచి వెలువడే రేడియేషన్ బారి నుంచి తప్పించేందుకు శాస్త్రవేత్తలు కొత్త పదార్థాన్ని అభివృద్ధిపరిచారు. కొరియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీకి చెందిన గు జాంగ్-మిన్ బృందంలోని శాస్త్రవేత్తలు కలసి ఎమ్‌ఎక్స్‌ఈన్ నుంచి దీన్ని తయారు చేశారు.
టైటానియం, కార్బన్‌ల నుంచి తయారైన 2డీ అకర్బన రసాయన సమ్మేళనాల తరగతికి చెందినదే ఈ ఎమ్‌ఎక్స్‌ఈన్. ఇందులో ఓ పొర నానోమీటర్ మందంతో ఉంటుంది. ఎమ్‌ఎక్స్‌ఈన్ గృహోపకరణాల నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలను నిరోధిస్తుందని గుర్తించారు. దీన్ని తయారు చేయడం సులువు, ధర కూడా తక్కువగా ఉండటం మరో విశేషం.