దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఫెడరల్ రిజర్వ్ యథాతథ పాలసీ అమలుకే నిర్ణయించడంతో దేశీయంగా ఇన్వెస్టర్లకు జోష్ వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో ట్రేడింగ్ ప్రారంభంలోనే మార్కెట్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 174 పాయింట్లు జంప్‌చేసి 30,069వద్ద 30వేల మైలురాయిని అధిగమించింది. అటు నిఫ్టీకూడా 40 పాయింట్లుఎగిసి 9350ని తాకింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 0.8 శాతం జంప్‌చేసి 22,624 వద్ద కొత్త గరిష్టాన్ని తాకడం విశేషం. నిన్న మార్కెట్ ముగిసిన తరువాత ప్రకటించిన క్యూ 4 ఫలితాలను ప్రకటించిన ఐసీఐసీఐ 5 శాతానికిపైగా ఎగిసింది. రెరా కిక్‌తో రియల్ ఎస్టేట్ పాజిటివ్‌గా ఉంది. అలాగే మెటల్ సెక్టార్‌కూడా లాభాల్లో ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, గ్రాసిం, భారతి ఎయిర్ టెల్ తదితర షేర్లు లాభపడుతున్నాయి.
అటు పుత్తడి ధరలు మరింత బలహీనతనుకొనసాగిస్తున్నాయి.