ప్రైవేట్ రంగ అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ‘ఐసీఐసీఐ లంబార్డ్ జీఐసీ’ తాజాగా ‘ఇల్ టేక్ కేర్’ అనే మొబైల్ హెల్త్ యాప్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ యాప్‌ను ‘గూగుల్ ప్లేస్టోర్’ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రత్యేకతలు
♦ దగ్గరిలో ఉన్న డాక్టర్లు, డయాగ్నస్టిక్స్, ఫార్మసీ వివరాలు పొందొచ్చు.
♦ రియల్ టైమ్‌లో డాక్టర్ల అపాయింట్‌మెంట్‌ను బుక్ చేసుకోవచ్చు. అవసరమైతే డాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడే వెసులుబాటు ఉంది.
♦ దగ్గరిలోని డయాగ్నస్టిక్ సెంటర్లలో టెస్ట్‌లు చేయించుకోవచ్చు.
♦ స్టోర్‌లో మెడిసిన్స్‌ను డిస్కౌంట్‌లో కొనుగోలు చేయవచ్చు. హోమ్ డెలివరీ కూడా పొందొచ్చు.
♦ షెడ్యూల్ హె ల్త్ చెకప్‌లు చేయించుకునే అవకాశముంది.
♦ ఐసీఐసీఐ లంబార్డ్ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి రియల్ టైమ్ క్యాష్‌లెస్ అప్రూవల్ పొందొచ్చు.
♦ పాలసీ అర్హత, ప్రయోజనాలు, లావాదేవీలను ట్రాక్ చేయవచ్చు.
♦ మెడిసిన్ రిమైండర్స్ సెట్ చేసుకోవచ్చు. మెడికల్ రికార్డ్‌లను యాప్‌లో భద్రంగా ఉంటాయి. వీటిని ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయవచ్చు. సేవలపై సంబంధిత సంస్థలకు రేటింగ్ ఇవ్వొచ్చు.
ఇల్ టేక్ కేర్
Published Mon, Jan 29 2018 1:51 AM | Last Updated on Wed, Sep 19 2018 8:46 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment