హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ జనరల్ ఇన్సూరెన్స్ దిగ్గజం ఐసీఐసీఐ లాంబార్డ్ 14 పాలసీలను ఆవిష్కరించింది. వీటిలో కొన్ని కొత్తవి కాగా, మరికొన్ని అప్‌గ్రేడ్ చేసినవి ఉన్నాయి. అయిదు హెల్త్ పాలసీలు, 4 వాహన బీమా, మిగతావి కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన పాలసీలు ఉన్నాయి.
కరోనా అనంతర పరిస్థితుల్లో కస్టమర్ల ఆలోచనా ధోరణులు, అవసరాలు మారాయని తదనుగుణంగా తాజా పాలసీలను రూపొందించామని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్య బీమాకు సంబంధించి హెల్త్ బూస్టర్, బీఫిట్, సీనియర్ సిటిజన్స్ కోసం గోల్డెన్ షీల్డ్ తదితర పాలసీలు ప్రవేశపెట్టినట్లు సంస్థ డిప్యుటీ వైస్ ప్రెసిడెంట్లు అమిత్ ఆనంద్, సుబ్రతో బెనర్జీ, సుధీర్ నాయుడు వివరించారు. డ్రోన్లకు, సైబర్ నేరాల నుంచి రక్షణ కల్పించేలా రిటైల్ సైబర్ లయబిలిటీ పాలసీలు కూడా అందుబాటులోకి తెచ్చినట్లు వారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment