ఐసీఐసీఐ లాంబార్డ్కు 50 లక్షల జరిమానా | Irda slaps Rs 50 lakh penalty on ICICI Lombard | Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ లాంబార్డ్కు 50 లక్షల జరిమానా

Published Fri, Oct 24 2014 6:49 PM | Last Updated on Sat, Sep 2 2017 3:19 PM

ఐసీఐసీఐ లాంబార్డ్కు 50 లక్షల జరిమానా

ఐసీఐసీఐ లాంబార్డ్కు 50 లక్షల జరిమానా

ఐసీఐసీఐ లాంబార్డ్ సాధారణ బీమా సంస్థకు బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ 50 లక్షల జరిమానా విధించింది. 2011,  2012, 2013, 2014 ఆర్థిక సంవత్సరాలలో పలు నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించారు. ఉత్తర్వులు జారీ అయిన 15 రోజుల్లోగా ఈ జరిమానా మొత్తాన్ని చెల్లించాలని ఐఆర్డీఏ తెలిపింది.

తప్పుడు ఎంట్రీలు వేసినందుకు, ఒకే పాలసీకి వేరే్వేరు పత్రాలు చూపినందుకు, ఫైళ్ల నిబంధనలను ఉల్లంఘించడం లాంటి చర్యల కారణంగా ఈ జరిమానా వేశారు. ప్రభుత్వ సెక్యూరిటీలు, ఇతర గ్యారంటీడ్ సెక్యూరిటీలలో కనీసం 30 శాతం పెట్టుబడి పెట్టాల్సి ఉండగా, 2009 ఫిబ్రవరి 13 నాటికి కేవలం 28.87 శాతం మాత్రమే ఉన్నాయి. అలాగే క్లెయిముల పరిష్కారం విషయంలో కూడా ఆలస్యం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement