ఐసీఐసీఐ లాంబార్డ్‌ ‘నడిపిన మేరకు’ బీమా | ICICI Lombard joins pay-as-you-drive policy segment | Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ లాంబార్డ్‌ ‘నడిపిన మేరకు’ బీమా

Published Mon, Aug 1 2022 6:16 AM | Last Updated on Mon, Aug 1 2022 6:16 AM

ICICI Lombard joins pay-as-you-drive policy segment - Sakshi

ముంబై: ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపనీ.. ‘పే యాజ్‌ యూ డ్రైవ్‌’ పాలసీని కస్టమర్ల కోసం తీసుకొచ్చింది. ఈ ఫ్లోటర్‌ ప్లాన్‌ తీసుకున్న పాలసీదారు తన వాహనాన్ని నడిపినంత దూరం మేరకే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పైగా పాలసీదారుకు ఒకటికి మించిన వాహనాలు ఉంటే వాటన్నింటికీ ఈ ఒక్క ఫ్లోటర్‌ ప్లాన్‌ కవరేజీ ఆఫర్‌ చేస్తుంది.

సంప్రదాయ మోటారు బీమా పాలసీలో ఉండే అన్ని కవరేజీలు.. ప్రమాద కవరేజీ, మూడో పక్షానికి నష్టం వాటిల్లితే పరిహారం, వాహనదారుకి వ్యక్తిగత ప్రమాద కవరేజీ ఇందులోనూ ఉంటాయి. ఈ ప్లాన్‌లో రెండు ఆప్షన్లు ఉన్నాయి. మొదటి ఆప్షన్‌లో పాలసీదారు వాహనాన్ని నడిపిన మేరకు కవరేజీ లభిస్తుంది. రెండో ఆప్షన్‌లో వాహనాన్ని ఏ విధంగా నడుపుతున్నారనే దాని ఆధారంగా ప్రీమియం ఉంటుంది. మంచి డ్రైవింగ్‌ చేసే వారికి ప్రీమియంలో తగ్గింపు లభిస్తుంది. ఇండింపెడెంట్‌ పాలసీలు కలిగి ఉన్న వారు ఈ ఫ్లోటర్‌ ప్లాన్‌లోకి మారిపోయే అవకాశాన్ని కూడా సంస్థ కల్పిస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement