న్యూఢిల్లీ: ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.232 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత క్యూ3లో వచ్చిన నికర ఆదాయం రూ.220 కోట్లతో పోలిస్తే 5 శాతం వృద్ధి సాధించామని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,843 కోట్ల నుంచి రూ.2,020 కోట్లకు పెరిగినట్లు కంపెనీ సీఈఓ భార్గవ్ దాస్‌గుప్తా తెలిపారు. స్థూల ప్రీమియం రూ.2,542 కోట్ల నుంచి రూ.3,002 కోట్లకు పెరిగిందని, పంటల బీమా ఆదాయం రూ.91 కోట్ల నుంచి రూ.87 కోట్లకు తగ్గిందని చెప్పారాయన.
గత క్యూ3లో 2.01 రెట్లుగా ఉన్న సాల్వెన్సీ రేషియో ఈ క్యూ3లో 2.21 రెట్లకు మెరుగుపడిందని తెలియజేశారు. పన్ను కేటాయింపులు రూ.5 కోట్ల నుంచి రూ.91 కోట్లకు పెరిగాయన్నారు. అంతకు ముందటి సంవత్సరాలకు సంబంధించిన పన్నులకు ఈ క్వార్టర్‌లోనూ, ఈ ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల కాలంలోనూ అధిక కేటాయింపులు జరపాల్సి వచ్చిందని వెల్లడించారు. ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో బీఎస్‌ఈలో ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ షేర్ ఇంట్రాడేలో 6 శాతం లాభపడింది. చివరకు 4 శాతం లాభంతో రూ.812 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment