
ముంబై: జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్ తాజాగా చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ) కోసం మూడు వినూత్న బీమా పథకాలను ప్రవేశపెట్టింది. ఎంఎస్‌ఎంఈ సురక్షా కవచ్ పాలసీ, ప్రాపర్టీ ఆల్ రిస్క్ (పీఏఆర్) పాలసీ, ఐ–సెలెక్ట్ లయబిలిటీ పాలసీ వీటిలో ఉన్నాయి.
అంతర్జాతీయ ఎంఎస్‌ఎంఈ దినోత్సవం సందర్భంగా వీటిని ప్రవేశపెట్టినట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ మంత్రి తెలిపారు. సురక్షా కవచ్ పాలసీ.. విపత్తుల నుంచి వాటిల్లే ఆస్తి నష్టాన్ని భర్తీ చేస్తుందని, ప్రమాదాల వల్ల జరిగే ఆస్తి నష్టాల కోసం పీఏఆర్ కవరేజీ ఉపయోగపడుతుందని వివరించారు. ఆభరణాల వంటి విలువైన వాటికి ఐ–సెలెక్ట్ లయబిలిటీతో అదనపు కవరేజీ పొందవచ్చని పేర్కొన్నారు.