నగదు రహితంతో అవినీతి అంతం
Published Sun, Jan 8 2017 12:41 AM | Last Updated on Tue, Sep 5 2017 12:41 AM
కర్నూలు(అర్బన్): అవినీతి నిర్మూలనకు నగదు రహిత లావాదేవీలు సహకరిస్తాయని 28 ఆంధ్రా బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ బీవీ మధుసూదనన్ అన్నారు. శనివారం స్థానిక ఉస్మానియా కళాశాలలో ఎన్‌సీసీ ఆధ్వర్యంలో జరిగిన ‘ ఈ – లావాదేవీలు – నగదు రహిత కొనుగోళ్లు’ అంశంపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో హాజరైన ఆయన మాట్లాడుతూ దేశ నిర్మాణంలో యువత పాత్ర ప్రధానమైనదని, అభివృద్ధి అంశాల్లో ఎస్‌సీసీ విద్యార్థులు పాలుపంచుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఎస్‌బీఐ పర్సనల్ బ్యాంకింగ్ బ్రాంచ్ మేనేజర్ ఎంఏఎస్ హరిబాబు, బ్రాంచ్ మేనేజర్ డి.లక్ష్మినరసింహులు, అసిస్టెంట్ మేనేజర్ ఏ విజయకుమార్ సెల్‌ఫోన్ ద్వారా లావాదేవీలను ఏ విధంగా చేయవచ్చో, బ్యాంకు సేవలను ఎలా ఉపయోగించుకోవచ్చో అవగాహన కల్పించారు. ఈ- చెల్లింపులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించడం వల్ల వినియోగదారులకు సమయం ఆదా అవుతుందన్నారు. ప్రతి కొనుగోలుకు జవాబుదారితనం పెరుగుతుందని, దేశ ఆదాయం పెరగడమే గాకుండా దేశాభివృద్ధికి తోడ్పడిన వారమవుతామన్నారు. సమావేశంలో ఉస్మానియా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టరసిలార్ మహమ్మద్, ఐక్యూఏసీ కో ఆర్డినేటర్ సయ్యద్ సమీఉద్దీన్, ఎన్‌సీసీ అధికారి మండీ అన్వర్‌హుసేన్ పాల్గొన్నారు.
Advertisement