పోస్టాఫీసుల్లో నగదు రహిత లావాదేవీలు
పోస్టాఫీసుల్లో నగదు రహిత లావాదేవీలు
Published Sat, May 6 2017 12:02 AM | Last Updated on Tue, Sep 5 2017 10:28 AM
– స్వైప్ మిషన్ సేవలు ప్రారంభించిన పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): నగదు రహిత లావాదేవీలను డివిజన్‌లోని అన్ని ప్రధాన తపాలా కేంద్రాలకు విస్తరింపజేస్తామని పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక హెడ్ పోస్టాఫీసులో స్వైప్ మిషన్ సేవలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. మనీయార్డర్, రిజిష్టర్డ్ పోస్టు, ఫారిన్ పార్సిల్స్ వంటి వాటితో పాటు ఇతరత్రా లావాదేవీలకు వినియోగదారులు డబ్బును ఏటీఎం కార్డుల ద్వారా చెల్లించొచ్చన్నారు. 15 స్వైపింగ్ మిషన్లకు ప్రతిపాదన పంపామని, త్వరలో ఆదోని హెడ్ పోస్టాఫీసుతో పాటు డివిజన్ పరిధిలోని సెలెక‌్షన్ గ్రేడ్ పోస్టాఫీసుల్లో స్వైపింగ్ మిషన్ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. కలెక్టరేట్ పక్కన త్వరలో ఏటీఎం సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. స్వైప్ మిషన్ ప్రారంభ కార్యక్రమంలో పోస్టుమాస్టర్ ఎద్దుల డేవిడ్, ఏపీఎం బషీరుద్దీన్, ఫిలాటలీ ఇన్‌చార్జి నాగవెంకటేశ్వర్లు, ఏఓ లలిత తదితరులు పాల్గొన్నారు.
Advertisement