postoffice
-
అలాంటి ఏకైక పోస్టాఫీస్ ఇదొక్కటే.. ఏడాదికి ఐదు నెలలే పని
ప్రపంచానికి అత్యంత సుదూరాన మంచుదీవిలో నడుస్తున్న ఏకైక పోస్టాఫీసు ఇది. అంటార్కిటికాలోని పోర్ట్ లాక్రాయ్లో ఉన్న ఈ పోస్టాఫీసును యునైటెడ్ కింగ్డమ్ అంటార్కిటిక్ హెరిటేజ్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఇది కేవలం పోస్టాఫీసు మాత్రమే కాకుండా, మ్యూజియమ్ కూడా. ప్రస్తుతం ఈ పోస్టాఫీసులో నాలుగు పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టాఫీసు ఏడాదిలో ఐదు నెలలు మాత్రమే పనిచేస్తుంది. ఇక్కడి ఖాళీలపై ఉద్యోగ ప్రకటన ఇటీవల వెలువడగానే ప్రపంచం నలుమూలల నుంచి వందలాదిగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇందులో పనిచేసేవారు పోస్టాఫీసు బాధ్యతలతో పాటు మ్యూజియం నిర్వహణను కూడా చూసుకోవాల్సి ఉంటుంది. వాటికి తోడు ఇక్కడ పెద్దసంఖ్యలో ఉండే పెంగ్విన్లను లెక్కించడం కూడా వారి బాధ్యతే! పెంగ్విన్లను లెక్కించడంలో నైపుణ్యం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు అదనపు అర్హత. సూదూరంగా ఏకాంత ప్రదేశంలో ఉన్న ఈ పోస్టాఫీసులో పనిచేయడం ఏమంత ఆషామాషీగా ఉండదని, ఏటా నవంబర్ నుంచి మార్చి వరకు పనిచేసే ఈ పోస్టాఫీసులో ఇక్కడి వాతావరణాన్ని తట్టుకుంటూ పనిచేయడమే కష్టమని యునైటెడ్ కింగ్డమ్ అంటార్కిటిక్ హెరిటేజ్ ట్రస్ట్ సీఈవో కామిలా నికోల్ తెలిపారు. ఇక్కడ రోజుకు పన్నెండు గంటల సేపు పనిచేయాల్సి ఉంటుందని, ఇప్పటి వరకు తమ ప్రకటనకు స్పందనగా రెండున్నర వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, ఇక్కడి వాతావరణాన్ని తట్టుకుని పనిచేసే శారీరక దారుఢ్యం, శాస్త్ర పరిశోధనల కోసం ఇక్కడకు వచ్చే పర్యాటకులతో తగిన రీతిలో మెలిగే కలివిడితనం, ఓర్పు, సహనం ఉన్న అభ్యర్థుల కోసం చూస్తున్నామని చెప్పారు. -
భారతీయులకు శుభవార్త, 38 దేశాలకు చేరిన పోస్టల్ సేవలు..తాజాగా..
భారత్‌కు చెందిన పోస్టల్ డిపార్ట్మెంట్ కెనడా ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందంతో భారతీయులు స్థానిక పోస్టాఫీస్‌ల నుంచి కెనడాకు పార్శిళ్లను పంపుకోవచ్చు. ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్ సర్వీస్ (ITPS) పేరుతో కార్యకలాపాలు జూన్ 30 నుంచి ప్రారంభమయ్యాయి. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన ప్రకారం.. భారతీయులు నిర్వహించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) యూనిట్లు, చిన్న వ్యాపారాలు లేదంటే తయారు చేసిన వస్తువుల్ని, వారి వ్యాపారాల్ని మరింత విస్తరించేందుకు వీలుగా లేదంటే వ్యాపారాల్ని కెనడాకు సైతం సులభంగా ఎగుమతి చేసుకునేందుకు వీలుగా భారత్ - కెనడా ప్రభుత్వాలు ఈ కొత్త సర్వీసుల్ని రూపొందించాయి. తద్వారా ఎగుమతిదారుల సరిహద్దు షిప్పింగ్ అవసరాలు తీరిపోనున్నాయి. భారత్ ఇప్పటికే ఐటీపీఎస్ తరహా సేవల్ని 38 దేశాల్లో అందిస్తుండగా.. తాజాగా కెనడాతో కుదుర్చుకున్న ఒప్పందంతో ఆ సంఖ్య మొత్తం 39కి చేరింది. 39 దేశాల్లో పోస్టాఫీస్ సేవలు జూన్ 1, 2023 ముందు వరకు 16 దేశాలకు మాత్రమే దేశీయ పోస్టాఫీసుల నుంచి దేశీయంగా తయారు చేసిన వస్తువల్ని విదేశాలకు పంపుకునే వెసలు బాటు ఉంది. జూన్ 1 తర్వాత ఆ సంఖ్య 38కి చేరింది. భారత్ కొత్తగా ఒప్పందం చేసుకున్న దేశాల జాబితాలో ఫ్రాన్స్, బ్రిటన్, యూఏఈ, ఈజిప్ట్‌తో పాటు ఇతర దేశాలు ఉన్నాయి. ధరలు ఎలా ఉన్నాయి ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్, ఇతర మార్కెట్ సంస్థల ఉత్పత్తులతో పోల్చితే ఐటీపీఎస్ రేట్లు అందుబాటులో ఉన్నాయని పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు చెబుతున్నారు. మొదటి 50 గ్రాముల పార్శిళ్లపై రూ.400 వసూలు చేస్తుండగా.. అదనంగా ప్రతి 50 గ్రాములకు రూ.35 చొప్పున చెల్లించాలి. ఇలా 2 కేజీల వరకు నామమాత్రంగా సర్వీసులు ఛార్జీలు వసూలు చేస్తుండగా.. ఆపై వస్తువు బరువు, ప్రాంతాన్ని బట్టి రేట్లు మారతాయని పోస్టల్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన నోటీసుల్లో పేర్కొంది. ఇదీ చదవండి : పాకిస్తాన్లో జాక్‌మా ప్రత్యక్షం.. రహస్య ప్రాంతంలో -
పెరిగిన సుకన్య సమృద్ధి యోజన పథకం వడ్డీరేట్లు..ఎంతో తెలుసా?
Small saving schemes: సామాన్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. జులై - సెప్టెంబర్ మధ్య కాలానికి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన స్మాల్ స్కీమ్ వడ్డీ రేట్లను 10 నుంచి 30 బేసిస్ మేర పెరిగాయి. సవరించిన వడ్డీ రేట్లు ఏడాది, రెండేళ్ల డిపాజిట్ స్కీమ్‌లో వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్లు పెరగ్గా, 5ఏళ్ల రికరింగ్ డిపాజిట్ స్కీమ్ 30 బేసిస్ పాయింట్లు పెరిగాయి. దీంతో ఏడాది డిపాజిట్ స్కీమ్‌లో వడ్డీ రేట్లు 6.9 శాతం, 2ఏళ్ల డిపాజిట్ స్కీమ్‌లో వడ్డీ రేట్లు 7 శాతం, 5ఏళ్ల రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లు 6.5 శాతానికి చేరుకున్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ (ఎన్ఎస్ఈ), కిసాన్ వికాస్ పాత్ర, సీనియర్ సిటిజన్ స్కీమ్, సుకన్య సంవృద్ది యోజన స్కీమ్ మినహా మిగిలిన స్కీమ్‌లు యధావిధిగా కొనసాగుతున్నాయి. జులై1 నుంచి అమలు ప్రభుత్వం అందించే చిన్న పొదుపు పథకాలు సురక్షితం, ఇతర పెట్టుబడులతో పోలిస్తే ఈస్మాల్ సేవింగ్స్‌లో వడ్డీ రేట్లు ఎక్కువ. దీంతో కేంద్ర పథకాల్లో పెట్టుబడి పెట్టే రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టే సీనియర్ సిటిజన్లు, పిల్లల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం తరచూ వడ్డి రేట్లను పెంచుతుంది. ఇక, తాజా వడ్డీ రేటు పెరుగుదల మునుపటి త్రైమాసికంతో పోల్చితే, ప్రభుత్వం 70బీపీఎస్ వరకు పెంపుదలను ప్రకటించింది. అంతేకాకుండా, గత రెండు త్రైమాసికాల్లో, సుకన్య సమృద్ధి ఖాతా పథకం, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్ర, నెలవారీ ఆదాయ పొదుపు పథకం, అన్ని పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ల వంటి ప్రముఖ పథకాల రేట్లను ప్రభుత్వం పెంచింది. చదవండి👉 అతి తక్కువ ధరకే ప్రభుత్వ డబుల్ బెడ్రూం ఫ్లాట్లు, ఇళ్ల కోసం ఎగబడుతున్న జనం! -
సీనియర్ సిటిజన్స్ కోసం అదిరిపోయే స్కీమ్, రిస్క్ లేకుండా అధిక వడ్డీతో..
సీనియర్ సిటిజన్స్ కోసం తక్కువ రిస్క్, అధికరాబడిని అందించే రకరకాల స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో పోస్టాఫీస్ అందించే ఈ స్కీమ్ ప్రత్యేకం. ఎందుకంటే మిగిలిన స్కీమ్స్‌తో పోలిస్తే ఈ పథకంలో రాబడి ఎక్కువగా ఉందని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు మనం ఆ స్కీమ్ గురించి, ఆ స్కీమ్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పోస్టాఫీస్‌లో ఈ స్కీమ్‌ను సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) అని పిలుస్తారు. 60 ఏళ్లు పైబడిన వ్యక్తులకు తక్కువ రిస్క్‌తో పోస్టల్ స్కీమ్ అందిస్తుంది. అధిక వడ్డీ రేటు, ఆదాయపు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పథకాన్ని పోస్ట్ ఆఫీస్‌లో లేదా కొన్ని బ్యాంకుల్లో కూడా తెరవవచ్చు. ముఖ్యంగా పథకంలో డబ్బులు పొదుపు చేయాలంటే ఈ ఖాతా తెరిచే సయమానికి సంబంధిత ఖాతాదారుని వయస్సు 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి. అయితే కొన్ని వర్గాలకు చెందిన వ్యక్తులకు వయో సడలింపు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఖాతాలో సీనియర్ సిటిజన్లు రూ.15 లక్షల వరకు డిపాజిట్లపై త్రైమాసిక వడ్డీని పొందవచ్చు. ఎవరు అర్హులు పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్‌లో సీనియర్ సిటిజన్ లైన అతని/ఆమె విడివిడిగా లేదంటే సంయుక్తంగా ఎస్సీఎస్ఎస్ ఖాతాను ఓపెన్ చేయొచ్చు. వడ్డీ రేటు ప్రస్తుతం ఎస్సీఎస్ఎస్ వడ్డీరేటు 7.4శాతం ఉండగా కేంద్రం త్రైమాసిక ప్రాతిపదికన ఇతర పథకాలతోపాటు ఈస్కీమ్ వడ్డీ రేటును సవరిస్తుందనే విషయాల్ని గుర్తించుకోవాలి. ఇటీవల కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ స్కీమ్ వడ్డీ రేటు 2022 (నూతన సంవత్సరం 2022 మొదటి త్రైమాసికంలో) మారలేదు. ఆదాయపు పన్ను మినహాయింపు ఎస్సీఎస్ఎస్ ఖాతాలో చేసిన పెట్టుబడి ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద మినహాయింపు పొందచవ్చు. అధికారిక పోస్ట్ ఆఫీస్ వెబ్సైట్ నుండి వచ్చిన అప్డేట్ల ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో అన్ని ఎస్సీఎస్ఎస్ ఖాతాలలో మొత్తం వడ్డీ రూ. 50,000 కంటే ఎక్కువ ఉంటే వడ్డీపై పన్ను విధించబడుతుంది. మెచ్యూరిటీ పీరియడ్ ఎస్సీఎస్ఎస్ ఖాతాలో జమ చేసిన మొత్తానికి ఐదు సంవత్సరాల కాలవ్యవధికి వడ్డీ లభిస్తుందని డిపాజిటర్లు తప్పనిసరిగా గమనించాలి. డిపాజిటర్ ఖాతా మెచ్యూరిటీ అయిన ఒక సంవత్సరంలోపు, మూడు సంవత్సరాలకు ఒకసారి పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డిపాజిట్ పరిమితి సీనియర్ సిటిజన్లు గరిష్టంగా రూ.15 లక్షల వరకు ఎస్సీఎస్ఎస్ ఖాతాలో పెట్టుబడి పెట్టవచ్చు. ఎస్సీఎస్ఎస్ ఖాతాను తెరవడానికి అవసరమైన కనీస మొత్తం రూ.1000గా ఉంది. చదవండి: ఎల్ఐసీకి భారీ షాక్, తగ్గుతున్న ఆదాయం -
ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడులు వచ్చే స్కీమ్స్ ఇవే
ఫిక్స్డ్ డిపాజిట్స్‌తో పోలిస్తే అధిక భద్రతనిస్తూనే, పూర్తి హామీతో కూడిన రాబడులను ఇచ్చే సాధనాలు ఏవైనా ఉన్నాయా? – కవాన్జైన్ మీరు సీనియర్ సిటిజన్ అయితే (60 ఏళ్లు నిండినవారు) సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), ప్రధానమంత్రి వయవందన యోజన (పీఎంవీవీవై), పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (పీవో ఎంఐఎస్) పథకాలను పరిశీలించొచ్చు. ఇవన్నీ భద్రతతో కూడిన పెట్టుబడి సాధనాలు. వీటికి ప్రభుత్వ హామీ ఉంటుంది. వీటి తర్వాత షార్ట్ డ్యురేషన్ డెట్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఇవి తక్కువ నాణ్యత (రేటెడ్) సాధనాల్లో ఇన్వెస్ట్ చేయవు. ఒకవేళ మీరు చిన్న వయసులో ఉండి, దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసుకోవాలని అనుకుంటుంటే.. కొంత మొత్తాన్ని ఈక్విటీకి కూడా కేటాయించుకోవాలి. రిస్క్ ఏ మాత్రం తీసుకోకపోతే చెప్పుకోతగ్గ రాబడులను పొందలేరు. రిస్క్ తీసుకోని ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల విలువ వృద్ధి చెందుతుందని అనుకుంటారు కానీ.. ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసి చూస్తే వాస్తవ విలువ తగ్గిపోతుంది. ద్రవ్యోల్బణ రేటు కంటే తక్కువగా మీ పెట్టుబడులు వద్ధి చెందుతుంటే కనుక.. చూడ్డానికి పెరిగినట్టు అనిపించినా వాటి విలువ తగ్గిపోయినట్టే. కనుక దీర్ఘకాలానికి పెట్టుబడుల్లో కొంత మేర రిస్క్ తీసుకోవచ్చు. నా వయసు 50 ఏళ్లు. స్మాల్‌క్యాప్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాను. ప్రస్తుత పరిస్థితుల్లో స్మాల్‌క్యాప్‌నకు, ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల మధ్య కేటాయింపులు ఎలా ఉండాలి? – ఎస్కే శర్మ మీ వయసు ప్రకారం చూస్తే.. స్మాల్‌క్యాప్ విభాగంలో (మార్కెట్ విలువ పరంగా చిన్న కంపెనీలు) ఇన్వెస్ట్ చేయడం మంచిదే. గణనీయంగా విలువ పడిపోయినా ఫర్వాలేదనుకుంటే మీరు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అద్భుత రాబడులను ఇచ్చినా.. స్వల్పకాలంలో ఇవి ఎంతో నిరుత్సాహపరుస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో వీటిల్లో పతనం చాలా స్వల్పకాలంలోనే గణనీయంగా ఉంటుంది. అయితే ప్రతీ ఇన్వెస్టర్ కూడా కనీసం 20–25 శాతం వరకు అయినా స్థిరాదాయ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇందుకు ఎటువంటి సూత్రం అవసరం లేదు. ఇలా చేయడం వల్ల స్మాల్‌క్యాప్స్ నుంచి సంపాదించుకున్న మొత్తానికి కొంత రక్షణ కల్పించుకోవచ్చు. స్మాల్‌క్యాప్ పెట్టుబడులు గణనీయంగా పెరగొచ్చు లేదా పడిపోవచ్చు. దానికి తగినట్టు పెట్టుబడుల కేటాయింపులను మార్చుకోవాలి. ఉదాహరణకు స్మాల్‌క్యాప్‌లో 75 శాతం, ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలకు 25 శాతంగా అస్సెట్అలోకేషన్ను నిర్ణయించుకున్నారనుకుంటే.. స్మాల్‌క్యాప్ పెట్టుబడుల విలువ మొత్తం పెట్టుబడుల్లో 90 శాతానికి చేరితే.. అప్పుడు తిరిగి 75 శాతానికి తగ్గించుకోవాలి. అంటే ఆ మేరకు స్మాల్‌క్యాప్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ స్మాల్‌క్యాప్ పెట్టుబడులు 75 శాతం కంటే తగ్గిపోయి, డెట్ సాధనాల విలువ పెరిగిన సందర్భాల్లో.. డెట్ పెట్టుబడులను 25 శాతానికి తగ్గించుకుని, మిగిలిన మేర స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులు పెంచుకోవాలి. డెట్ సాధనాలకు కనీసం 20–25 శాతం అయినా కేటాయించుకుంటేనే అర్థవంతంగా ఉంటుంది. ఇంతకంటే తక్కువ కేటాయింపులు చేసుకుని.. పోర్ట్‌ఫోలియోలను మార్చుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం నెరవేరదు. చదవండి: డీమ్యాట్ అకౌంట్ల స్పీడ్, స్టాక్ మార్కెట్లో పెరుగుతున్న పెట్టుబడులు -
తాడిపత్రి సబ్ పోస్ట్‌ఆఫీసులో గోల్మాల్
-
పోస్టాఫీసుల్లో నగదు రహిత లావాదేవీలు
– స్వైప్ మిషన్ సేవలు ప్రారంభించిన పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు కర్నూలు (ఓల్డ్‌సిటీ): నగదు రహిత లావాదేవీలను డివిజన్లోని అన్ని ప్రధాన తపాలా కేంద్రాలకు విస్తరింపజేస్తామని పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక హెడ్ పోస్టాఫీసులో స్వైప్ మిషన్ సేవలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. మనీయార్డర్, రిజిష్టర్డ్ పోస్టు, ఫారిన్ పార్సిల్స్ వంటి వాటితో పాటు ఇతరత్రా లావాదేవీలకు వినియోగదారులు డబ్బును ఏటీఎం కార్డుల ద్వారా చెల్లించొచ్చన్నారు. 15 స్వైపింగ్ మిషన్లకు ప్రతిపాదన పంపామని, త్వరలో ఆదోని హెడ్ పోస్టాఫీసుతో పాటు డివిజన్ పరిధిలోని సెలెక్షన్ గ్రేడ్ పోస్టాఫీసుల్లో స్వైపింగ్ మిషన్ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. కలెక్టరేట్ పక్కన త్వరలో ఏటీఎం సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. స్వైప్ మిషన్ ప్రారంభ కార్యక్రమంలో పోస్టుమాస్టర్ ఎద్దుల డేవిడ్, ఏపీఎం బషీరుద్దీన్, ఫిలాటలీ ఇన్చార్జి నాగవెంకటేశ్వర్లు, ఏఓ లలిత తదితరులు పాల్గొన్నారు. -
పోస్టాఫీసులో డిపాజిట్ల గోల్‌మాల్‌పై ఆందోళన
కళ్యాణదుర్గం రూరల్ : మండల పరిధిలోని బోరంపల్లి పోస్టాఫీసులో డిపాజిట్ల గోల్‌మాల్‌పై ఖాతాదారులు మంగళవారం ఆందోళనకు దిగారు. తాము డిపాజిట్ చేసిన డబ్బు ఏమైందో తెలపాలంటూ స్థానిక పోస్టాఫీసు వద్ద పోస్ట్‌మాస్టర్ (గ్రేడ్1)జగదీశ్వరతో ఖాతాదారులు లక్ష్మిదేవి, ఈరక్క, కె.లక్ష్మి, శకుంతలమ్మ, రత్నమ్మ, వంకా సరస్వతి వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కొంత మేరకు పోస్టాఫీసును నమ్మి నగదు డిపాజిట్ చేస్తే బీపీఎం రామ్మూర్తి అడ్రస్సు లేకుండా పోయాడన్నారు. గ్రామంలో 60 మంది దాకా ఒక్కొక్కరు రూ.10వేలు చొప్పున రూ.6లక్షల వరకు డిపాజిట్లు చేశామన్నారు. బీపీఎం రాక పోవడంతో వివరాలు ఆరా తీస్తే పోస్టాఫీసులో డిపాజిట్లు కట్టకుండా కట్టినట్లు తమకు పోస్టాఫీసు సీలు మాత్రం వేసి నగదు వాడుకున్నారన్నారు. తమ డిపాజిట్లు ఎక్కడ అని నిలదీస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నాడని మండిపడ్డారు. ఇందులో పోస్టాఫీసు అధికారులు వత్తాసు పలకడంతో బీపీఎం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. తాము కూలీ నాలీ చేసి దాచుకున్న సొమ్ము డిపాజిట్ రూపంలో పోస్టాఫీసుకు చెల్లిస్తే ఇలా మోసం చేయడం అన్యాయమన్నారు. గోల్మాల్ చేసిన సొమ్ము చెల్లించకుంటే తీవ్ర ఆందోళన వ్యక్తం హెచ్చరించారు. ఇందుకు పోస్ట్‌మాస్టర్ జగదీశ్వర స్పందిస్తూ రామ్మూర్తి సెలవులో ఉన్నాడని, విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామన్నారు. మూడు నెలలు ఓపిక పట్టాలని ఆందోళనకారులకు సర్ధిచెప్పడంతో వారు వెనుదిరిగారు. కార్యక్రమంలో ఖాతాదారులు వన్నూర్‌బీ, ఆనం అంజినమ్మ, వంకామీనక్షమ్మ, నాగలక్ష్మితో పాటు చాలా మంది ఖాతాదారులు ఉన్నారు. -
ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ నిరుద్యోగులకు వరం
–హెడ్ పోస్టాఫీసులో ప్రారంభించిన పోస్టుమాస్టర్ జనరల్ సంజీవ్ రంజన్ కర్నూలు (ఓల్డ్‌సిటీ): పోస్టాఫీసుల్లో ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ విధానం ప్రవేశపెట్టడం జిల్లాలోని నిరుద్యోగులకు వరమని పోస్టుమాస్టర్ జనరల్ సంజీవ్ రంజన్ అన్నారు. ఆదివారం స్థానిక హెడ్ పోస్టాఫీసులో ఆయన ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కర్నూలుతో పాటు నంద్యాల, తిరుపతి, అనంతపురం, విజయవాడ హెడ్ పోస్టాఫీసుల్లో ఈ రిజిస్ట్రేషన్ కేంద్రాలు ప్రారంభించామన్నారు. నేషనల్ కేరీర్ సర్వీసెస్ పోర్టల్‌కు అనుసంధానం చేసిన ఈ కేంద్రం నిరుద్యోగులకు, యాజమాన్యాలకు మధ్య వారధిలా పనిచేస్తుందన్నారు. నిరుద్యోగుల అర్హతలు, నైపుణ్యతల వివరాలను నమోదు చేసి ఆన్లైన్లో ఉంచుతామని తెలిపారు. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు వారికి అవసరమైన అర్హతలు, నైపుణ్యాలు కలిగిన యువతీ యువకులను పోర్టల్ ద్వారా ఎంపిక చేసుకుంటారని చెప్పారు. యాభైరెండు సెక్టార్లలోని మూడు వేల రకాల ఉద్యోగాలు పోర్టల్ పరిధిలోకి వస్తాయని తెలిపారు. మార్చి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కోర్ సిస్టమ్ ఇంటగ్రేషన్ (సీఎస్ఐ) విధానం ద్వారా భవిష్యత్తులో సాఫ్ట్వేర్ మ్యాచ్ కావడం లేదనే సమస్య ఉండదని చెప్పారు. పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు మాట్లాడుతూ అభ్యర్థులు తమ వివరాలను కొత్తగా నమోదు చేసుకునేందుకు రూ. 15, అప్డేట్ చేసుకునేందుకు రూ. 5 ఫీజు చొప్పున రుసుం చెల్లించాల్సి ఉంటుందని, నమోదైన వివరాల ప్రింటర్ కాపీ పొందాలనుకుంటే మరో రూ. 10 చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. మొదటి రోజునే జిల్లాలోని 25 మంది నిరుద్యోగులు తమ వివరాలను నమోదు చేయించుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ మల్లికార్జునశర్మ, ఏఎస్పీలు సి.హెచ్.శ్రీనివాస్, నాగానాయక్, హెడ్ పోస్టుమాస్టర్ వై.డేవిడ్, ఏఐపీవోలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వెల్దుర్తి పోస్టాఫీస్‌లో చోరీ
వెల్దుర్తి రూరల్ : స్థానిక అనంతయ్య కాంప్లెక్స్‌లోని కొత్త పోస్టాఫీసులో చోరీ జరిగింది. పోస్టల్ అధికారులు సోమవారం పోస్టాఫీసు ప్రారంభించ సంకల్పించారు. ఇందులో భాగంగా చిన్నచిన్న పనులు చేయడానికి ఆదివారం 11గంటల ప్రాంతంలో కార్యాలయం తాళం తీయగా..వస్తువులు చిందరవందరగా పడి ఉండడం గమనించారు. లాకర్ తెరచి ఉండడంతో గమనించిన వెంటనే విషయం పోస్ట్ మాస్టర్ చైతన్యకు సిబ్బంది రాజేష్ తెలిపారు. దాదాపు రూ. 2లక్షల వరకు చోరీ జరిగినట్లు సమాచారం. -
ఇక నుంచి పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సేవలు
డోన్ టౌన్: ఇకపై అన్ని పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్, జీవిత బీమారంగ సేవలు అందుబాటులో ఉంటాయని రీజియన్ పోస్టుమాస్టర్ జనరల్ సంజీవరంజన్ తెలిపారు. బుధవారం డోన్ కేంద్ర తపాలా కార్యాలయంతోపాటు రైల్వే ఆర్ఎమ్ఎస్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోస్టల్ శాఖలో సమూల మార్పులు తీసుకువచ్చామని, ఖాతాదారులకు విస్తృతసేవలు అందించేందుకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పోస్టాఫీసుల్లో పొదుపు చేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతప్రచారం చేయాలని ఆయన సిబ్బందికి సూచించారు. స్పీడ్‌పోస్టు, రిజిస్టర్‌పోస్టు సేవలందించడంలో డోన్ పోస్టాఫీసు వెనుకబడి ఉందని ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆయన వెంట డివిజనల్ పోస్టల్ సూపరిండెంట్ సుబ్బారావు, పోస్టల్ ఇన్స్పెక్టర్ విజయమోహన్, బ్రాంచ్ పోస్టుమాస్టర్ సుధాకర్, సిబ్బంది సుజాత, లావణ్య, పద్మావతి, పోస్టల్ ఏజెంట్ల సంఘం నాయకుడు రామారావు తదితరలు ఉన్నారు. -
బాబుది ‘ప్రత్యేక’ మోసం
– నేడు హెడ్‌పోస్టాఫీసు ఎదుట ధర్నా – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కర్నూలు (అర్బన్): ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి సుజనాచౌదరి రోజుకోమాట మారుస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. బుధవారం సాయంత్రం స్థానిక ప్రభుత్వ అతి«థి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హోదా విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న దొంగ నాటకాన్ని ప్రజలకు వివరించేందుకు ఆందోళనలను ఉద్ధతం చేస్తామన్నారు. ఇందులో భాగంగా ఈనెల 8వ తేదీన రాష్ట్రంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహిస్తున్నామని, కర్నూలులోని హెడ్‌పోస్టాఫీసు ఎదుట ఆందోళన ఉంటుందని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదాతో పారిశ్రామిక పరంగా రాష్ట్రం అభివద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని, తద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టాలని చూస్తోందన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పిన ప్రస్తుత కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట మారుస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అధికార పార్టీ నేతలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. విలేకరుల సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి ఎస్ఎన్ రసూల్, ఏఐటీయుసీ రాష్ట్ర కార్యదర్శి మనోహర్‌మాణిక్యం, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ లెనిన్‌బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పోస్టాఫీసులో పోస్టుమాస్టర్ అక్రమాలు
-
పోస్టాఫీసులకు తాళాలు
గుంటూరు : గ్రామీణ తపాలా ఉద్యోగుల ఆందోళన మరింత ఉధృత రూపం దాల్చింది. గురువారం గుంటూరు జిల్లా రేపల్లెలో ప్రధాన పోస్టాఫీసుతోపాటు సబ్ పోస్టాఫీసులకు ఉద్యోగులు తాళాలు వేసి నిరసన తెలిపారు. ప్రధాన తపాలా ఉద్యోగుల వేతనాల స్థాయిలో తమకూ వేతనాలు ఇవ్వాలని, ఇందుకోసం జ్యుడీషియల్ కమిటీ వేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. వీరి ఆందోళనకు ఏఐటీయూసీ, సీఐటీయూ తదితర కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. (రేపల్లె)