Small saving schemes: సామాన్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. జులై - సెప్టెంబర్ మధ్య కాలానికి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన స్మాల్ స్కీమ్ వడ్డీ రేట్లను 10 నుంచి 30 బేసిస్ మేర పెరిగాయి.
సవరించిన వడ్డీ రేట్లు ఏడాది, రెండేళ్ల డిపాజిట్ స్కీమ్‌లో వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్లు పెరగ్గా, 5ఏళ్ల రికరింగ్ డిపాజిట్ స్కీమ్ 30 బేసిస్ పాయింట్లు పెరిగాయి. దీంతో ఏడాది డిపాజిట్ స్కీమ్‌లో వడ్డీ రేట్లు 6.9 శాతం, 2ఏళ్ల డిపాజిట్ స్కీమ్‌లో వడ్డీ రేట్లు 7 శాతం, 5ఏళ్ల రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లు 6.5 శాతానికి చేరుకున్నాయి.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ (ఎన్‌ఎస్‌ఈ), కిసాన్ వికాస్ పాత్ర, సీనియర్ సిటిజన్ స్కీమ్, సుకన్య సంవృద్ది యోజన స్కీమ్ మినహా మిగిలిన స్కీమ్‌లు యధావిధిగా కొనసాగుతున్నాయి.
జులై1 నుంచి అమలు
ప్రభుత్వం అందించే చిన్న పొదుపు పథకాలు సురక్షితం, ఇతర పెట్టుబడులతో పోలిస్తే ఈస్మాల్ సేవింగ్స్‌లో వడ్డీ రేట్లు ఎక్కువ. దీంతో కేంద్ర పథకాల్లో పెట్టుబడి పెట్టే రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టే సీనియర్ సిటిజన్లు, పిల్లల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం తరచూ వడ్డి రేట్లను పెంచుతుంది.
ఇక, తాజా వడ్డీ రేటు పెరుగుదల మునుపటి త్రైమాసికంతో పోల్చితే, ప్రభుత్వం 70బీపీఎస్ వరకు పెంపుదలను ప్రకటించింది. అంతేకాకుండా, గత రెండు త్రైమాసికాల్లో, సుకన్య సమృద్ధి ఖాతా పథకం, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్ర, నెలవారీ ఆదాయ పొదుపు పథకం, అన్ని పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ల వంటి ప్రముఖ పథకాల రేట్లను ప్రభుత్వం పెంచింది.
చదవండి👉 అతి తక్కువ ధరకే ప్రభుత్వ డబుల్ బెడ్రూం ఫ్లాట్లు, ఇళ్ల కోసం ఎగబడుతున్న జనం!
Comments
Please login to add a commentAdd a comment