small savings schemes
-
‘సుకన్య సమృద్ధి’ వడ్డీ పెరిగిందా? పోస్టాఫీసు స్కీములపై అప్డేట్
చిన్న పొదుపు పథకాలకు వడ్డీ రేట్లపై కేంద్ర ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. వీటిలో సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, కిసాన్ వికాస్ పత్ర, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, టర్మ్ డిపాజిట్లు వంటివి ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి ఆయా పథకాలపై వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ప్రస్తుత వడ్డీ రేట్లు∇ సుకన్య సమృద్ధి యాజన (SSY): సంవత్సరానికి వడ్డీ రేటు 8.2 శాతం∇ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS): వడ్డీ రేటు 8.2 శాతం∇ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): వడ్డీ రేటు 7.1 శాతం∇ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC): వడ్డీ రేటు 7.7 శాతం∇ పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (POMIS): వడ్డీ రేటు 7.4 శాతం∇ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్: వడ్డీ రేటు 7.5 శాతం∇ పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్: వడ్డీ రేటు 6.7 శాతంఇదీ చదవండి EPFO: కొత్త ప్రతిపాదన.. రిటైరయ్యాక భారీగా సొమ్ముప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. వడ్డీ రేట్లను చివరిగా 2023 డిసెంబర్ 31న సవరించింది. ఈ చిన్న పొదుపు పథకాలన్నీ పోస్టాఫీసు ద్వారా అందిస్తున్నారు. ఈ పథకాలకు కేంద్ర ప్రభుత్వ మద్దతు, సార్వభౌమాధికార హామీ ఉంటాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పీపీఎఫ్ వంటి కొన్ని పథకాలు ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 80సీ కింద పన్ను-పొదుపు ప్రయోజనాలను అందిస్తాయి. -
ఎక్కువ ఖాతాలున్నా.. ప్రయోజనాలు సున్నా
ఈక్విటీలు మెరుగైన రాబడులు ఇస్తున్నా కానీ, ఇతర పెట్టుబడి సాధనాల ప్రాధాన్యాన్ని విస్మరించలేం. పెట్టుబడులు అన్నింటినీ ఒక్క చోటే పెట్టేయడం రిస్క్ పరంగా అనుకూలం కాదు. వివిధ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవాలి. అప్పుడే రిస్క్ తగ్గించుకుని, మెరుగైన రాబడులకు అవకాశం ఉంటుంది. అందుకే ఒకవైపు ఈక్విటీల్లోకి పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తున్నప్పటికీ.. మరోవైపు చిన్న మొత్తాల పొదుపు పథకాలు ఇప్పటికీ ఎంతో మందికి ఆకర్షణీయమైన పెట్టుబడి సాధనాలుగా కొనసాగుతున్నాయి. రిస్క్‌లేని హామీతో కూడిన ఈ పథకాలు ముఖ్యమైన జీవిత లక్ష్యాలకు చేదోడుగా నిలుస్తాయనడంలో అతిశయం లేదు. అయితే ఇందులో పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, ఎన్ఎస్సీ పరంగా కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. వీటికి సంబంధించిన వివరాలే ఈ వారం ప్రాఫిట్‌ప్లస్ కథనం. పీపీఎఫ్ ఒక్కటే ఎక్కువ మంది ఎంపిక చేసుకునే ఆరి్థక సాధనాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఒకటి. ఇందులో ఒక ఆరి్థక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోగలరు. ఈ మొత్తంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. 15 ఏళ్ల కాల వ్యవధి ముగిసిన తర్వాత మరో ఐదేళ్ల పాటు గడువును పొడిగించుకోవచ్చు. ఇందులో పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపే కాకుండా, గడువు ముగిసిన తర్వాత ఉపసంహరించుకునే మొత్తంపైనా పన్ను మినహాయింపు ఉంది. ఈ ప్రయోజనమే ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. ఇది చూసే కొంత మంది ఒకటికి మించిన పీపీఎఫ్ ఖాతాలను తెరిచి ఇన్వెస్ట్ చేస్తున్నారు. పోస్టాఫీస్‌లో ఒకటి, బ్యాంక్‌లో ఒకటి తెరుస్తున్నారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం. ఒకరి పేరిట ఒక పీపీఎఫ్ ఖాతానే ప్రారంభించడం లేదా కొనసాగించడం చేయగలరని కేంద్ర ఆరి్థక శాఖ జూలై 12న ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఒకటికి మించిన ఖాతాలను గుర్తించినట్టయితే అందులో ఒక దానిని ప్రాథమిక ఖాతాగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రెండో ఖాతాలో జమలపై ఎలాంటి వడ్డీ రాదన్నది తాజా ఉత్తర్వుల సారాంశం. ఒకవేళ రెండు ఖాతాలున్నట్టు తేలితే రెండో ఖాతాలోని జమలను మొదటి ఖాతాకు బదిలీ చేస్తారు. ఒక ఆర్థిక సంత్సరంలో గరిష్ట పెట్టుబడి రూ.1.5 లక్షలకు మించి జమ చేసినట్టయితే, అదనంగా ఉన్న మొత్తాన్ని ఎలాంటి వడ్డీ లేకుండా వెనక్కిచ్చేస్తారు. రెండు కంటే ఎక్కువ ఖాతాలున్నట్టు తేలితే అప్పుడు ప్రారంభించిన తేదీ నుంచి సున్నా వడ్డీయే లభిస్తుంది.పిల్లల పేరిట పీపీఎఫ్ ఖాతాలు... కొంత మంది పిల్లల పేరుతోనూ ఒకటికి మించిన పీపీఎఫ్ ఖాతాలను తెరుస్తున్నారు. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లల పేరిట పీపీఎఫ్ ఖాతాను ప్రారంభించొచ్చు. ఒక మైనర్ (బాలుడు/బాలిక) పేరిట ఒక పీపీఎఫ్ ఖాతాకే పరిమితం కావాలి. ఇలా ఒక మైనర్ పేరిట ఒకటికి మించి ఉన్న ఖాతాలను ఇరెగ్యులర్ (అక్రమం) అకౌంట్లుగా గుర్తిస్తారు. అప్పుడు మైనర్ పేరిట ఉన్న ఖాతాల్లో ఒకదానిని మెయిన్ అకౌంట్‌గా తల్లిదండ్రులు లేదా సంరక్షకులు గుర్తించాల్సి ఉంటుంది. అప్పుడు ఆ ఖాతాకు నిబంధనల మేరకు ప్రస్తుత వడ్డీ రేటు అమలవుతుంది. ఒకటికి మించి అదనంగా ఉన్న ఖాతాల్లోని జమలకు పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు 4 శాతం చొప్పున 18 ఏళ్లు వచ్చే వరకు చెల్లిస్తారు. 18 ఏళ్లు నిండగానే మేజర్ అయిన తర్వాత సాధారణ పీపీఎఫ్ ఖాతా కింద దాన్ని పరిగణిస్తారు. అప్పటి నిబంధనల ప్రకారం ఆ ఖాతాపై చర్యలు ఉంటాయి. నిబంధనల ప్రకారం పీపీఎఫ్ ఖాతాలో ఒక ఆరి్థక సంవత్సరానికి కనీసం రూ.500 నుంచి, గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నిజానికి ఇద్దరు పిల్లలు ఉంటే విడిగా ఇద్దరి పేరిట రెండు ఖాతాలు తెరిచి నిర్వహించుకోవచ్చు. అయినప్పటికీ, తన పేరుతో, తన పిల్లల పేరుతో ఇలా అన్నింటిలోనూ గరిష్ట పరిమితి రూ.1.5 లక్షలకు మించి ఇన్వెస్ట్ చేసుకోరాదు. పీపీఎఫ్ ఖాతాను తాత, బామ్మ, అమ్మమ్మలు (గ్రాండ్ పేరెంట్స్) నిర్వహించరాదు. కేవలం తల్లిదండ్రులు మరణించి, పిల్లలకు ఆధారంగా మారిన వారే చట్టబద్ధ సంరక్షకులుగా వ్యవహరించడానికి అనుమతి ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన... సుకన్య సమృద్ధి యోజన ఎంతో ప్రాచుర్యం పొందిన పథకం. రోజుల శిశువు నుంచి పదేళ్లలోపు కుమార్తెల పేరిట ఖాతా తెరిచి ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బాలికకు 18 ఏళ్లు నిండే వరకు ఇది కొనసాగుతుంది. ఇందులో ఒక ఆరి్థక సంవత్సరంలో కనీసం రూ.250 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఖాతాకు 8.2 శాతం వడ్డీ రేటు అమలవుతోంది. ఇందులో చేసే పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. అలాగే, ఇందులో రాబడులపైనా పన్ను లేదు. ఒక కుటుంబం తరఫున గరిష్టంగా ఇద్దరు కుమార్తెల పేరిటే సుకన్య సమృద్ధి ఖాతాను తెరవడానికి ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన ఖాతాను (ఎస్ఎస్ఏఎస్) బాలిక తరఫున తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తెరవడానికి అనుమతి ఉంటుంది. అయితే, కొందరు మనవరాలి పేరిట కూడా ఖాతాలను తెరిచి ఇన్వెస్ట్ చేస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. దీంతో పిల్లలకు సహజ సంరక్షకులు అయిన తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు అయిన వారే సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరవడానికి ఉంటుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఒకవేళ మనవరాలి పేరిట తాత, అమ్మమ్మ, బామ్మలు తెరిచినట్టు గుర్తించినట్టయితే అప్పుడు సంరక్షణ బాధ్యత తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకులకు బదిలీ అవుతుంది. ఒక కుటుంబానికి రెండుకు మించి ఖాతాలున్నట్టు తేలితే అదనంగా ఉన్న వాటిని మూసివేస్తారు. వాటిలో జమ చేసే మొత్తాలపై వడ్డీ రాదు.నేషనల్ సేవింగ్స్ స్కీమ్... ఎంతో పాపులర్ అయిన చిన్న మొత్తాల పొదుపు పథకం ఇది. గతంలో ఏదైనా పోస్టాఫీస్ శాఖలో నేషనల్ సేవింగ్స్ స్కీమ్ ప్రారంభించేందుకు అవకాశం ఉండేది. దీన్ని 2002 నుంచి నిలిపివేశారు. కాకపోతే అప్పటికే తెరిచిన ఖాతాలను కొనసాగించేందుకు అనుమతించారు. 1990 ఏప్రిల్ 2కు ముందు తెరిచిన మొదటి ఖాతాకు ప్రస్తుత పథకం రేటు, రెండో ఖాతాకు పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా రేటు (4 శాతం)కు అదనంగా 2 శాతం చెల్లిస్తారు. అక్టోబర్ 1 నుంచి ఈ రెండు ఖాతాలకు ఎలాంటి వడ్డీ రాదు. 1990 ఏప్రిల్ 2 తర్వాత తెరిచిన నేషనల్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాలకు సైతం అక్టోబర్ నుంచి ఎలాంటి వడ్డీ చెల్లించరు. దీంతో ఈ ఖాతాలను మూసివేసుకోవడమే మంచి నిర్ణయం అవుతుంది. ఎన్ఆర్ఐలు అలా చేయడం కుదరదు..ఎన్ఆర్ఐ హోదాను వెల్లడించకుండా పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయడం చెల్లదు. అలాంటి ఖాతాల్లోని జమలకు పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ రేటు 4 శాతమే అమలవుతుంది. అది కూడా 2024 సెపె్టంబర్ 30 వరకే. ఆ తర్వాత నుంచి బ్యాలన్స్‌పై వడ్డీ రాదు. నిబంధనల ప్రకారం ఎన్ఆర్ఐలు పీపీఎఫ్ ఖాతా తెరవడానికి అనుమతి లేదు. ‘‘భారత్‌లో పీపీఎఫ్ ఖాతా తెరిచిన తర్వాత విదేశాలకు వెళ్లి ఎన్ఆర్ఐగా మారితే 15 ఏళ్ల గడువు ముగిసేంత వరకు ఆ ఖాతాను కొనసాగించొచ్చు. అందులో చేసే పెట్టుబడులకు ఇతరులకు మాదిరే వడ్డీ రేటు వర్తిస్తుంది. అయితే, నాన్ రీపాట్రియేషన్ నిబంధనల కిందే వీరు పీపీఎఫ్ ఖాతాను కొనసాగించుకోగలరు. అంటే గడువు ముగిసిన తర్వాత వచ్చే మెచ్యూరిటీని ఎన్ఆర్ఐ తన విదేశీ ఖాతాకు బదిలీ చేసుకోవడం కుదరదు. లేదా విదేశీ కరెన్సీలోకి మార్చుకోవడం కుదరదు. తన నివాస హోదాలో మార్పు చోటుచేసుకున్న వెంటనే సంబంధిత వ్యక్తి బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు తెలియజేయడం తప్పనిసరి’’ అని స్టెబుల్ ఇన్వెస్టర్ వ్యవస్థాపకుడు దేవ్ ఆశిష్ తెలిపారు.మార్గం ఉంది.. పీపీఎఫ్‌లో పెట్టుబడులు, రాబడులపై పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలంటే.. అప్పుడు దంపతులు ఇద్దరూ తమ పేరిట పీపీఎఫ్ ఖాతా తెరిచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇద్దరు పిల్లలు ఉంటే భార్య, భర్త చెరొక పీపీఎఫ్ ఖాతా తెరిచి గరిష్ట పరిమితి మేరకు ఒక్కో ఖాతాలో ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పిల్లల పేరిట తెరిచిన పీపీఎఫ్ ఖాతాను ఐదేళ్లు నిండిన తర్వాత వైద్య పరమైన అవసరాల కోసం మూసివేసేందుకు అనుమతి ఉంటుంది. –సాక్షి, బిజినెస్ డెస్క్ -
చిన్న మొత్తాల పొదుపు పథకాల నిబంధనల్లో మార్పులు
న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలలో కొన్నింటికి సంబంధించినిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక సవరణలు తెచి్చంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), టైమ్ డిపాజిట్ల పథకాల నిబంధనల్లో మార్పులు చేసింది. నూతన నోటిఫికేషన్ ప్రకారం.. పదవీ విరమణ ప్రయోజనాలు (నిధులు) చేతికి అందిన రోజు నుంచి మూడు నెలల వరకు ఎస్సీఎస్ఎస్ ఖాతా ప్రారంభించడానికి అవకాశం లభించింది. ఇప్పటి వరకు ఇది ఒక నెలగానే అమల్లో ఉంది. 55 ఏళ్ల నుంచి 60 ఏళ్లు దాటని వారికే ఇది వర్తిస్తుంది. ఎస్సీఎస్ఎస్ డిపాజిట్ ఐదేళ్ల కాల వ్యవధి ముగిసిన అనంతరం రెన్యువల్ చేసుకునే వారికి అప్పుడు అమల్లో ఉన్న వడ్డీ రేటును అమలు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగి (కేంద్ర, రాష్ట్ర) అయి, 50 ఏళ్లు నిండిన అనంతరం మరణించినట్టయితే, అప్పుడు వచ్చే ప్రయోజనాలను జీవిత భాగస్వామి ఎస్సీఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెట్టుబడి పెట్టి ఏడాదిలోపు వెనక్కి తీసుకుంటే డిపాజిట్లో ఒక శాతాన్ని మినహాయిస్తారు. ఎస్సీఎస్ఎస్ డిపాజిట్‌ను ఐదేళ్లు ముగిసిన తర్వాత మరో మూడేళ్ల కాలానికి రెన్యువల్ చేసుకోవచ్చు. ఇక నుంచి అలా ప్రతి మూడేళ్లకోసారి రెన్యువల్ చేసుకుంటూ వెళ్లొచ్చు. అలాగే, పీపీఎఫ్ ఖాతాను ముందస్తుగా మూసివేయడానికి సంబంధించిన నిబంధనల్లో మార్పులు తెచ్చింది. ఐదేళ్ల టైమ్ డిపాజిట్‌ను నాలుగేళ్లు ముగిసిన తర్వాత వెనక్కి తీసుకుంటే, పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాకు అమలయ్యే వడ్డీ రేటునే చెల్లిస్తారు. ప్రస్తుతం నాలుగేళ్ల తర్వాత ఉపసంహరించుకుంటే మూడేళ్ల కాలానికి అమలయ్యే రేటును ఇస్తున్నారు. -
పెరిగిన సుకన్య సమృద్ధి యోజన పథకం వడ్డీరేట్లు..ఎంతో తెలుసా?
Small saving schemes: సామాన్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. జులై - సెప్టెంబర్ మధ్య కాలానికి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన స్మాల్ స్కీమ్ వడ్డీ రేట్లను 10 నుంచి 30 బేసిస్ మేర పెరిగాయి. సవరించిన వడ్డీ రేట్లు ఏడాది, రెండేళ్ల డిపాజిట్ స్కీమ్‌లో వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్లు పెరగ్గా, 5ఏళ్ల రికరింగ్ డిపాజిట్ స్కీమ్ 30 బేసిస్ పాయింట్లు పెరిగాయి. దీంతో ఏడాది డిపాజిట్ స్కీమ్‌లో వడ్డీ రేట్లు 6.9 శాతం, 2ఏళ్ల డిపాజిట్ స్కీమ్‌లో వడ్డీ రేట్లు 7 శాతం, 5ఏళ్ల రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లు 6.5 శాతానికి చేరుకున్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ (ఎన్ఎస్ఈ), కిసాన్ వికాస్ పాత్ర, సీనియర్ సిటిజన్ స్కీమ్, సుకన్య సంవృద్ది యోజన స్కీమ్ మినహా మిగిలిన స్కీమ్‌లు యధావిధిగా కొనసాగుతున్నాయి. జులై1 నుంచి అమలు ప్రభుత్వం అందించే చిన్న పొదుపు పథకాలు సురక్షితం, ఇతర పెట్టుబడులతో పోలిస్తే ఈస్మాల్ సేవింగ్స్‌లో వడ్డీ రేట్లు ఎక్కువ. దీంతో కేంద్ర పథకాల్లో పెట్టుబడి పెట్టే రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టే సీనియర్ సిటిజన్లు, పిల్లల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం తరచూ వడ్డి రేట్లను పెంచుతుంది. ఇక, తాజా వడ్డీ రేటు పెరుగుదల మునుపటి త్రైమాసికంతో పోల్చితే, ప్రభుత్వం 70బీపీఎస్ వరకు పెంపుదలను ప్రకటించింది. అంతేకాకుండా, గత రెండు త్రైమాసికాల్లో, సుకన్య సమృద్ధి ఖాతా పథకం, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్ర, నెలవారీ ఆదాయ పొదుపు పథకం, అన్ని పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ల వంటి ప్రముఖ పథకాల రేట్లను ప్రభుత్వం పెంచింది. చదవండి👉 అతి తక్కువ ధరకే ప్రభుత్వ డబుల్ బెడ్రూం ఫ్లాట్లు, ఇళ్ల కోసం ఎగబడుతున్న జనం! -
బ్యాంకింగ్ వ్యవస్థలోకి పోస్టాఫీస్ బ్యాంక్
ముంబై, సాక్షి: సుమారు 150 ఏళ్ల చరిత్ర కలిగిన పోస్టల్ శాఖ 2020లో అత్యంత కీలకంగా వ్యవహరించింది. కోవిడ్-19 తలెత్తడంతో దేశవ్యాప్తంగా లాక్డవున్లు అమలయ్యాయి. ఈ సమయంలో వైమానిక, రైల్వే, రోడ్డు రవాణా దాదాపుగా నిలిచిపోయినప్పటికీ పోస్టల్ శాఖ పలు సర్వీసులు అందించింది. ప్రధానంగా మెడికల్ తదితర కీలకమైన పార్సిల్ డెలివరీలలో ముందు నిలిచింది. లాక్‌డవున్ సమయంలో 10 లక్షల మెడికల్ ఆర్టికల్స్‌ను డెలివరీ చేసింది. వీటిలో మెడికల్ పరికరాలు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, ఔషధాలున్నాయి. ఈ బాటలో పార్సిల్ హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని 2020 డిసెంబర్‌కల్లా వార్షికంగా 6 కోట్ల నుంచి 7.5 కోట్లకు పెంచుకుంది. కాగా.. ఈ ఏడాది(20201) ఏప్రిల్‌కల్లా పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్.. దేశంలోని ఇతర బ్యాంకు ఖాతాలతో కలసికట్టుగా నిర్వహించేందుకు వీలు కలగవచ్చని పీఎస్‌యూ దిగ్గజం ఇండియా పోస్ట్ భావిస్తోంది. ఇందుకు వీలుగా ఇటీవల పలు సర్వీసులను డిజిటైజేషన్ బాట పట్టించిన పోస్టల్ శాఖ 2021లో అన్ని సర్వీసులనూ ఆన్లైన్ చేయాలని భావిస్తోంది. (తొలుత మనకే వ్యాక్సిన్లు: సీరమ్) 50 కోట్ల ఖాతాలు పోస్ట్ ఆఫీస్‌కు కీలకమైన బ్యాంకింగ్ సొల్యూషన్(సీబీఎస్) ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నట్లు పోస్టల్ శాఖ సెక్రటరీ ప్రదీప్త కుమార్ తాజాగా పేర్కొన్నారు. 23,483 పోస్టాఫీసులు ఇప్పటికే ఈ నెట్వర్క్ పరిధిలోకి చేరినట్లు తెలియజేశారు. దేశవ్యాప్తంగా 1.56 లక్షల పోస్టాఫీసులున్నాయి. వీటి ద్వారా పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్‌లో 50 కోట్లమందికి ఖాతాలున్నాయి. పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీల నిర్వహణకు 1.36 లక్షల యాక్సెస్ పాయింట్లను ఏర్పాటు చేసింది. తద్వారా గ్రామీణ ప్రాంతాలలోనూ ఇంటివద్దనే బ్యాంకింగ్ సర్వీసులను అందిస్తోంది. (4 నెలల గరిష్టానికి రూపాయి) పలు పథకాలు పోస్టాఫీస్ పొదుపు పథకాలలో భాగంగా సేవింగ్స్ ఖాతా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి(ఎస్ఎస్వై), నేషనల్ సేవింగ్(ఎన్ఎస్సీ), కిసాన్ వికాస్ పత్ర, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ తదితరాలను అందిస్తున్న విషయం విదితమే. ఈ పథకాల కింద రూ. 10,81,293 కోట్ల ఔట్‌స్టాండింగ్ బ్యాలన్స్‌ను కలిగి ఉంది. సీబీఎస్ ద్వారా 24 గంటలూ ఏటీఎం, ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్‌కు వీలు కల్పిస్తోంది. పీవోఎస్‌బీ పథకాలన్నిటినీ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుకు అనుసంధానించింది. దీంతో మొబైల్ యాప్ డాక్‌పే ద్వారా లావాదేవీల నిర్వహణకు వీలు కల్పించింది. మొబైల్ యాప్ పోస్ట్‌మ్యాన్ మొబైల్ యాప్‌లో 1.47 పీవోఎస్‌లను భాగం చేసింది. తద్వారా 14 కోట్ల స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పార్సిల్ ఆర్టికల్స్ స్టేటస్‌ను వాస్తవిక సమాయానుగుణంగా పరిశీలించేందుకు వీలు కల్పించింది. డాక్ఘర్ నిర్యత్ కేంద్ర పేరుతో ఈకామర్స్కూ మద్దతు పలుకుతోంది. తద్వారా ఎంఎస్ఎంఈ ప్రొడక్టుల ఎగుమతులకు ప్రోత్సాహాన్నిస్తోంది. అంతేకాకుండా పోస్టల్ జీవిత బీమా, ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు ప్రత్యక్ష చెల్లింపులు తదితరాలలో గ్రామీణ ప్రాంతాలనూ డిజిటలైజేషన్లో భాగం చేస్తోంది. -
చిన్న పొదుపులు ఇప్పుడు ఓకేనా?
ఎన్నడూ లేని విధంగా, ఊహించని స్థాయిలో ఇటీవలే చిన్న మొత్తాల పొదుపు పథకాల (స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్) వడ్డీ రేట్లు గణనీయంగా కోతకు గురయ్యాయి. దేశంలో వడ్డీ రేట్లు అత్యంత కనిష్టాలకు చేరడంతో కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపు పథకాల్లో వడ్డీ రేట్లను 2020–21 ఏప్రిల్–జూన్ త్రైమాసికి సవరించింది. ఇన్నాళ్లూ మెరుగైన వడ్డీ రేట్లతో చిన్న పొదుపు పథకాలు.. బ్యాంకు ఎఫ్డీలు, ఇతర స్థిరాదాయ పథకాలతో పోలిస్తే ఎంతో ఆకర్షణీయంగా ఉండేవి. వడ్డీ రేట్లను పరిశీలించినట్టయితే వివిధ పథకాల్లో 0.7% నుంచి 1.40% వరకు తగ్గించడం జరిగింది. కాకపోతే పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాల డిపాజిట్లపై వడ్డీ రేటు 4%లో ఎటువంటి మార్పు చేయలేదు. రేట్లు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ఈ పథకాలను పెట్టుబడులకు పరిశీలించొచ్చా..? వీటిల్లో ఆకర్షణీయత ఇంకా మిగిలి ఉందా..? అన్న విషయమై నిపుణుల అభిప్రాయాల ఆధారంగా అందిస్తున్న ‘ప్రాఫిట్‌ప్లస్’ కథనం.. తాజా రేట్లు ఇవి.. ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) రేటు ఎక్కువగా కోతకు గురైంది. ఇంతకుముందు వరకు 7.2 శాతం వడ్డీ రేటుతో ఈ పథకం ఆకర్షణీయంగా ఉండేది. తాజాగా 1.4 శాతం మేర తగ్గించడంతో 5.8 శాతానికి పరిమితమైంది. అలాగే ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల టైమ్ డిపాజిట్లపై వడ్డీ రేటును కూడా 6.9 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గించారు. ఐదేళ్ల టైమ్ డిపాజిట్ రేటు మాత్రం 7.7 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గింది. వృద్ధులకు నిలకడైన ఆదాయాన్నిచ్చే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)లోనూ వడ్డీ రేటును 8.6 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించారు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వడ్డీ రేటు 1.1 శాతం తగ్గి 7.9 శాతం నుంచి 6.8 శాతానికి దిగొచ్చింది. సుకన్య సమృద్ధి యోజనలో 7.6 శాతంగా ఉంది. ఇక ఎంతో ప్రాచుర్యం పొందిన పీపీఎఫ్‌లో వడ్డీ రేటు సవరణ తర్వాత 7.1 శాతంగా ఉంది. పోస్టాఫీసు మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌లో 6.6 శాతానికి, కిసాన్ వికాస్ పత్రలో వడ్డీ రేటు 6.9 శాతానికి తగ్గిపోయింది. ఒకేసారి తగ్గింపు ఇంతలా..? చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లను ప్రభుత్వ సెక్యూరిటీల (జీ–సెక్) రేట్లకు అనుసంధానించాలన్నది కేంద్రం ఉద్దేశ్యం. అందుకే 2016 ఏప్రిల్ నుంచి వడ్డీ రేట్లను త్రైమాసికానికి ఒకసారి సవరించడాన్ని ఆరంభించింది. గత రెండేళ్లలో పదేళ్ల జీసెక్ ఈల్డ్స్ 2 శాతం తగ్గిపోయాయి. కానీ అదే స్థాయిలో చిన్న పొదుపు పథకాల రేట్లను తగ్గించలేదు. అలాగే, గత రెండు త్రైమాసికాల్లోనూ రేట్లను అసలు మార్చలేదు. తాజాగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) రెపో రేటును గణనీయంగా తగ్గించడంతో ప్రభుత్వం ఒకేవిడత ఈ స్థాయిలో రేట్ల తగ్గింపు నిర్ణయాన్ని తీసుకుంది. ఈ రేట్లపై ఇన్వెస్ట్ చేయవచ్చా? మరి ఈ స్థాయిలో రేట్లు తగ్గిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం దండగా..? అన్న సందేహం రావచ్చు. ఈ పథకాలకు సంబంధించి చూడాల్సిన ప్రధాన అంశం.. పెట్టుబడులకు అత్యధిక భద్రత కలిగి ఉండడం. పైగా మార్కెట్ రిస్క్ లేని స్థిరాదాయ పథకాలు. అదే విధంగా చాలా బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లతో పోల్చి చూస్తే ఇప్పటికీ కొన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లు ఆకర్షణీయంగానే ఉన్నాయి. ప్రముఖ బ్యాంకుల్లో టర్మ్ డిపాజిట్ రేట్లు 6–7 శాతం మధ్యే ఉన్నాయి. పైగా ఈ ఆదాయంపై ఆదాయపన్ను అమలవుతుంది. ఇటీవలే ఆర్బీఐ రెపో రేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించినందున బ్యాంకుల డిపాజిట్ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉంది. ఎస్బీఐ ఇప్పటికే ఈ దిశగా నిర్ణయం కూడా తీసుకుంది. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో వడ్డీ రేటు 7 శాతానికిపైనే ఉండడం గమనార్హం. ఎన్ఎస్సీ, కిసాన్ వికాస్ పత్ర 6.8 శాతం, 6.9 శాతం చొప్పున ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈరేట్లు ఆకర్షణీయమేనని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్, ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల టర్మ్ డిపాజిట్ల రేట్లు ఏమాత్రం ఆకర్షణీయంగానూ లేవన్నది నిజం. పన్ను ప్రయోజనాన్ని చూడాలి... భద్రతకుతోడు, ఆకర్షణీయమైన వడ్డీరేటుతోపాటు కొన్ని పథకాలపై పన్ను ప్రయోజనం కూడా పొందే అవకాశం వీటిల్లో ఉంది. పీపీఎఫ్, ఎన్ఎస్సీ, ఎస్సీఎస్ఎస్, సుకన్య సమృద్ధి యోజన, ఐదేళ్ల టైమ్ డిపాజిట్లో పెట్టుబడులు సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా ప్రయోజనానికి అర్హమైనవి. అలాగే, పీపీఎఫ్, సుకన్య స్కీమ్‌లో మెచ్యూరిటీ మొత్తంపైనా పన్ను ఉండదు. ఆ విధంగా చూసుకుంటే పన్ను ఆదాతో కూడిన అధిక రాబడులకు ఇందులో అవకాశం ఉంటుంది. ప్రత్యామ్నాయాలు.. ఈ చిన్న మొత్తాల పొదుపు పథకాలతోపాటు అధిక రాబడులను ఇచ్చే కొన్ని ఇతర పెట్టుబడి సాధనాలు కూడా ఉన్నాయి. వీటిల్లో ఆర్బీఐ జారీ చేసే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్లు ఒక చక్కని ప్రత్యామ్నాయం. వీటిల్లో రేటు 7.75 శాతంగా ఉంది. భద్రత ఎక్కువే. కాకపోతే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. అలాగే, కొన్ని ప్రైవేటు బ్యాంకులు సైతం డిపాజిట్లపై అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. డీసీబీ బ్యాంకు మూడేళ్ల డిపాజిట్‌పై 7.70 శాతం, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు 500 రోజుల డిపాజిట్‌పై 7.50 శాతం, ఆర్బీఎల్ బ్యాంకు రెండేళ్ల నుంచి మూడేళ్ల డిపాజిట్లపై 7.45 శాతం రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు 8.25–9.50 శాతం మధ్యన ఉన్నాయి. బ్యాంకుల్లో ఒక డిపాజిట్‌దారునికి గరిష్టంగా రూ.5 లక్షల వరకు డిపాజిట్‌పై బీమా ఉంటుంది. బ్యాంకు సంక్షోభంలో పడినా కానీ, ఆ మేరకు డిపాజిట్‌దారునికి లభిస్తుంది. కనుక వీటిని పరిశీలనలోకి తీసుకోవచ్చు. అయితే, బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఆలస్యం చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఆర్బీఐ రేట్లను గణనీయంగా తగ్గించిన తర్వాత చాలా బ్యాంకులు ఇంకా డిపాజిట్ రేట్లను సవరించాల్సి ఉంది. -
చిన్న మొత్తాల పొదుపు పథకాలకు మంచి రోజులు!
న్యూఢిల్లీ: చాలాకాలం తర్వాత చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్రం పెంచింది. ఎన్ఎస్సీ, పీపీఎఫ్ తదితర పథకాల్లో డిపాజిట్లపై 0.30–0.40 శాతం వరకు పెంచింది. ఈ మేరకు అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి అమల్లో ఉండే వడ్డీ రేట్లను కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ప్రకటించింది. ఇంత కాలం వడ్డీ రేట్లను తగ్గిస్తూ వచ్చిన కేంద్రం... ఆర్బీఐ కీలక రేట్లను పెంపు చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బ్యాంకులు సైతం పలు డిపాజిట్లు, రుణాలపై రేట్లను పెంచుతూ నిర్ణయాలను ప్రకటించాయి. చిన్న మొత్తాల పొదుపు, వృద్ధులు, ఆడపిల్లల సంక్షేమానికి ప్రోత్సాహం ఇచ్చేందుకు రేట్లను సవరించింది. వాస్తవానికి 2012 ఏప్రిల్ 1 నుంచి వడ్డీ రేట్లు తగ్గుతూ వచ్చిన విషయం గమనార్హం. నూతన రేట్లు నూతన వడ్డీ రేట్లు అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటాయి. ఈ సవరణ తర్వాత సుకన్య సమృద్ధి యోజన పథకంలో వడ్డీ రేటు 8.1 శాతం నుంచి 8.5 శాతానికి పెరిగింది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ రేటు 8.3 శాతం నుంచి 8.7 శాతానికి చేరింది. పీపీఎఫ్, ఎన్ఎస్సీ పథకాల్లో 7.6 శాతం నుంచి 8 శాతానికి, కిసాన్ వికాస్ పత్ర రేటు 7.3 శాతం నుంచి 7.7 శాతానికి పెరిగాయి. దీంతో కిసాన్ వికాస్పత్ర పథకంలో ఇప్పటి వరకు డిపాజిట్ 118 నెలల్లో రెట్టింపు అవుతుండగా, 112 నెలలకు తగ్గింది. ఐదేళ్ల టైమ్ డిపాజిట్‌పై రేటు 7.8 శాతానికి, ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ రేటు 7.3 శాతానికి చేరాయి. పోస్టాఫీసు సేవింగ్స్ డిపాజిట్లపై మాత్రం వడ్డీ రేటు 4 శాతంగానే కొనసాగుతుంది. అలాగే, ఏడాది నుంచి మూడేళ్ల వరకు కాల వ్యవధి టైమ్ డిపాజిట్లపై 0.30 శాతం అధికంగా వడ్డీ రేటు లభించనుంది. పొదుపును ప్రోత్సహించేందుకే: జైట్లీ చిన్న మొత్తంలో పొదుపు చేసే వారిని ప్రోత్సహించేందుకే ఈ చర్య అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ట్వీట్ చేశారు. ‘‘ఇది ఆడపిల్లల సంక్షేమాన్ని ప్రోత్సహిస్తుంది. వృద్ధుల ఆర్థిక భద్రతను మెరుగుపరుస్తుంది’’ అని జైట్లీ పేర్కొన్నారు. -
పీపీఎఫ్ విత్డ్రాయల్స్పై గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ : ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) లాంటి స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ నుంచి నగదును విత్‌డ్రా చేసుకోవడం ఇక నుంచి సులభతరం కానుంది. స్మాల్ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ తమ అకౌంట్లను ముందస్తుగా క్లోజ్ చేసుకోవడానికి అనుమతిస్తూ మంగళవారం కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రొవిజన్లను ప్రతిపాదించింది. ప్రస్తుతం పీపీఎఫ్ లాంటి స్మాల్ సేవింగ్స్ అకౌంట్లను ఐదేళ్లు పూర్తి కాకుండా మూసివేయడం కుదరదు. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించి కొత్త ప్రొవిజన్లతో అకౌంట్ యూజర్లు ఎప్పుడు కావాలంటూ అప్పుడు, గడువు ముగియక ముందే స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికి వీలుగా పీపీఎఫ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వంటి స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ చట్టాలపై సవరణలు చేపట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. మెడికల్ ఎమర్జెన్సీస్, ఉన్నత విద్యా వంటి వాటికోసం పీపీఎఫ్ అకౌంట్లను ముందుగా మూసివేసుకోవచ్చని ఆర్థికమంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాక మైనర్ తరుఫున గార్డియన్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌లో పెట్టుబడులు పెట్టొచ్చని కూడా తెలిపింది. దీనికి సంబంధించిన హక్కులు, బాధ్యతలన్నీ గార్డియన్ చేతుల్లో ఉంటాయన్నారు. అయితే ప్రస్తుతమున్న చట్టాల్లో మైనర్ల డిపాజిట్లకు సంబంధించి ఎలాంటి ప్రొవిజన్లు లేవు. అంతేకాక దివ్యాంగుల స్మాల్ సేవింగ్స్ అకౌంట్లకు కూడా ప్రత్యేక ప్రొవిజన్‌ను తీసుకొచ్చింది. బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ ఎక్కువ వడ్డీరేట్లను ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. వడ్డీరేట్లు అత్యధికమే కాకుండా ఆదాయపు పన్ను ప్రయోజనాలు వీరు పొందవచ్చు. అయితే ప్రస్తుతం చేసిన సవరణలతో స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రేటు లేదా పన్ను పాలసీలో ఎలాంటి మార్పులు కాలేదని ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది. -
బ్యాడ్‌న్యూస్ : ఆ పథకాల వడ్డీరేట్లు తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ : చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం బ్యాడ్‌న్యూస్ చెప్పింది. చిన్న పొదుపు పథకాలపై అందించే వడ్డీరేట్లను ప్రభుత్వం నేడు తగ్గించింది. జనవరి-మార్చి కాలంలో వడ్డీరేట్లను, ప్రస్తుతమున్న వడ్డీరేట్లకు 0.2 శాతం తగ్గించినట్టు పేర్కొంది. ఈ తగ్గించిన రేట్ల పథకాల్లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(ఎన్ఎస్సీ), సుకన్య సమృద్ధి అకౌంట్, కిసాన్ వికాస్ పాత్ర(కేవీపీ), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్) ఉన్నాయి. అయితే ఐదేళ్ల సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీరేటును 8.3 శాతంగానే ఉంచింది. సీనియర్ సిటిజన్స్ స్కీమ్ వడ్డీరేట్లను క్వార్టర్లీ ఆధారితంగా చెల్లిస్తారు. గతేడాది ఏప్రిల్ నుంచి అన్ని చిన్న పొదుపు పథకాల వడ్డీరేట్లను క్వార్టర్లీ ఆధారితంగా మారుస్తూ వస్తోంది. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం పీపీఎఫ్, ఎన్ఎస్సీ వార్షిక రేటు 7.6 శాతంగా కాగ, కేవీపీ వడ్డీరేటు 7.3 శాతంగా పేర్కొంది. అదేవిధంగా సుకన్య సమృద్ధి అకౌంట్ ప్రస్తుతమున్న రేటును 8.3 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించింది. 1-5 ఏళ్ల టర్మ్ డిపాజిట్ల వడ్డీరేట్లను 6.6 శాతం నుంచి 7.4 శాతంగా ఉంచింది. క్వార్టర్లీ ఈ వడ్డీరేట్లను చెల్లిస్తోంది. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం చిన్న పొదుపు పథకాల వడ్డీరేట్లను క్వార్టర్లీ ఆధారితంగా నోటిఫై చేస్తామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ చిన్న పొదుపు పథకాల వడ్డీరేట్లను ప్రభుత్వ బాండ్ దిగుబడులను లింక్ చేస్తూ చెల్లిస్తామని పేర్కొంది. ఈ నిర్ణయం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్ల వడ్డీ రేట్లను కూడా ప్రభావితం చేయనున్నది. త్వరలో బ్యాంకుల్లో వివిధ రకాల డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గటం ఖాయమని తెలుస్తోంది. -
40 ఏళ్ల కనిష్టానికి పీపీఎఫ్ వడ్డీరేటు
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు కనీసం 40 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఏప్రిల్-జూన్ క్వార్టర్లో పీపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీరేటును 7.9 శాతం ఆఫర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా త్రైమాసిక సమీక్షలో భాగంగా పీపీఎఫ్‌లపై వడ్డీరేటును 8 శాతం నుంచి 7.9 శాతానికి తగ్గించేందుకు ఆర్థికమంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. పీపీఎఫ్ వడ్డీరేట్లతో పాటు ఇతర చిన్న పొదుపు ఖాతాలపై కూడా వడ్డీరేట్లను పడిపోతున్నాయి. గతేడాది ఏప్రిల్ నుంచి పీపీఎఫ్ లాంటి చిన్నపొదుపు ఖాతాలపై త్రైమాసిక ప్రాతిపదికన వడ్డీరేట్లు నిర్ణయిస్తున్నారు. అంతకమునుపు వరకు వీటిని ఏడాదికోసారి సమీక్షించేవారు. అయితే రానున్న కాలంలో పీపీఎఫ్ వడ్డీరేట్లు మరింత తగ్గుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నారు. పీపీఎఫ్ వడ్డీరేట్లు తగ్గుతున్నప్పటికీ, పెట్టుబడులకు ఇదే మంచి ఆప్షన్ అని విశ్లేషకులు చెప్పారు. బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే, పాజిటివ్ రియర్ రిటర్న్స్ ను అందించడంలో పీపీఎఫ్ లు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని తెలిపారు. దీర్ఘకాలిక ట్యాక్స్-ప్రీ ప్రొడక్ట్ లలో పెట్టుబడులు పెట్టి ప్రయోజనాలు పొందాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. -
చిన్న మొత్తాలకు ఆర్బీఐ షాక్
న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు ఖాతాదారులకు ఆర్బీఐ షాకిచ్చింది. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన తర్వాత చిన్న మొత్తాల పొదుపు ఖాతాల్లోకి పెద్ద ఎత్తున డిపాజిట్ అవుతున్నట్టు తెలియడంతో రిజర్వు బ్యాంకు తాజాగా మరో ఉత్తర్వును జారీ చేసింది. రద్దు చేసిన నోట్లను చిన్న మొత్తాల పొదుపు ఖాతాల్లో జమ చేసుకోరాదని, అలాంటి నోట్లను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరాదని ఆదేశించింది. ఆ మేరకు బుధవారం రిజర్వు బ్యాంకు అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఉన్నపలంగా అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ నవంబర్ 8 నిర్ణయం ప్రకటించినప్పటి నుంచి రిజర్వు బ్యాంకు ప్రతి రోజూ ఏదో ఒక నిర్ణయం వెల్లడిస్తూనే ఉంది. రద్దు చేసిన నోట్లు చెల్లుబాటు కాకపోవడం, బ్యాంకుల్లో విపరీతమైన రద్దీ నేపథ్యం కావొచ్చు లేదా కొంత మంది తమ సొమ్మును మళ్లించడంవంటి ప్రయత్నాల్లో భాగంగా గడిచిన పక్షం రోజుల్లో అనేక కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రద్దయిన నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసినప్పుడు ఆ వివరాలను బ్యాంకులు సరిగా నమోదు చేయడం లేదని తెలిసి మంగళవారం అన్ని బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రద్దయిన నోట్లను ఎవరైతే బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారో వారి బ్యాంకు ఖాతా వివరాలను, డిపాజిట్ చేసిన సొమ్ము మొత్తం వివరాలను విధిగా నమోదు చేయాలని ఆదేశించింది. తాజాగా చిన్న మొత్తాల పొదుపు ఖాతాల్లో రద్దు చేసిన నోట్లను తీసుకోరాదని ఉత్తర్వులు జారీ చేసింది.