40 ఏళ్ల కనిష్టానికి పీపీఎఫ్ వడ్డీరేటు
40 ఏళ్ల కనిష్టానికి పీపీఎఫ్ వడ్డీరేటు
Published Mon, Apr 17 2017 1:45 PM | Last Updated on Tue, Sep 5 2017 9:00 AM
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు కనీసం 40 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఏప్రిల్-జూన్ క్వార్టర్లో పీపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీరేటును 7.9 శాతం ఆఫర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా త్రైమాసిక సమీక్షలో భాగంగా పీపీఎఫ్లపై వడ్డీరేటును 8 శాతం నుంచి 7.9 శాతానికి తగ్గించేందుకు ఆర్థికమంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. పీపీఎఫ్ వడ్డీరేట్లతో పాటు ఇతర చిన్న పొదుపు ఖాతాలపై కూడా వడ్డీరేట్లను పడిపోతున్నాయి. గతేడాది ఏప్రిల్ నుంచి పీపీఎఫ్ లాంటి చిన్నపొదుపు ఖాతాలపై త్రైమాసిక ప్రాతిపదికన వడ్డీరేట్లు నిర్ణయిస్తున్నారు. అంతకమునుపు వరకు వీటిని ఏడాదికోసారి సమీక్షించేవారు.
అయితే రానున్న కాలంలో పీపీఎఫ్ వడ్డీరేట్లు మరింత తగ్గుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నారు. పీపీఎఫ్ వడ్డీరేట్లు తగ్గుతున్నప్పటికీ, పెట్టుబడులకు ఇదే మంచి ఆప్షన్ అని విశ్లేషకులు చెప్పారు. బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే, పాజిటివ్ రియర్ రిటర్న్స్ ను అందించడంలో పీపీఎఫ్ లు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని తెలిపారు. దీర్ఘకాలిక ట్యాక్స్-ప్రీ ప్రొడక్ట్ లలో పెట్టుబడులు పెట్టి ప్రయోజనాలు పొందాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
Advertisement
Advertisement