ఈ స్కీంలో నెలకు రూ. 12,500 పెట్టుబడి పెడితే.. కోటి రూపాయలు
సాక్షి,ముంబై: ప్రభుత్వ పథకాల ద్వారా లభించే వడ్డీతో ఇన్వెస్టర్లు గణనీయమైన లాభాలను దక్కించుకోవచ్చు. ముఖ్యంగా పన్ను రహిత ప్రభుత్వ పథకంతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా పొందవచ్చు. రిస్క్ లేని ప్రభుత్వ పథకాల్లో చిన్న పెట్టుబడులే మంచి రాబడిని అందిస్తాయి. అలాంటి వాటిలో ఒకటి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీం.
ఈ పథంలో పెట్టుబడి ద్వారా రూ. 1 కోటి రూపాయల వరకు లబ్ధి పొందవచ్చు. అయితే 25 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి. అంతేకాదు రూ. 65 లక్షల కంటే ఎక్కువ వడ్డీ మనకు దక్కుతుంది. సంవత్సరానికి ఒకసారి లేదా, నెలకు ఒకసారి చొప్పున పెట్టుబడి పెడితే దానికి కాంపౌండ్ వడ్డీ లబిస్తుంది. వార్షిక రాబడి రేటు 7.1 శాతం. ఈ పథకం కింద అనుమతించబడిన అత్యధిక పెట్టుబడి కనిష్టం రూ.500 గా ఉంటే, రూ. 1.5 లక్షలు. ఇది కూడా పన్ను రహితమే కావడం గమనార్హం.
అంతేకాదు ప్రతి మూడు నెలలకోసారి మూల్యాంకనం చేయడం ద్వారా ప్రభుత్వం ఈ పథకం కింద వడ్డీ రేటును పెంచుతుంది. ఏ పోస్టాఫీసులోనైనా పీపీఎఫ్ ఖాతాను తెరవవచ్చు. ఈ ఖాతాలు 15 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధిని కలిగి ఉంటాయి, అయితే వాటిని అదనంగా ఐదు సంవత్సరాల పాటు పొడిగించుకోవచ్చు.
పీపీఎఫ్‌లో డబ్బును ఎలా డిపాజిట్ చేయాలి
పీపీఎఫ్ కాలిక్యులేటర్ ప్రకారం, పెట్టుబడిదారుడు పీపీఎఫ్ పథకంలో నెలకు రూ. 12,500 లేదా సంవత్సరానికి రూ. 1.50 లక్షలు పెడితే 15 సంవత్సరాలలో మొత్తం రాబడి రూ. 40.68 లక్షలు అవుతుంది. అంటే 22.50 లక్షల రూపాయలు పెట్టుబడిపై ర. 18.18 లక్షలు వడ్డీగా చెల్లిస్తారు.
ఆ తర్వాత దీన్ని ఐదేళ్ల పాటు పొడిగించి, మరో ఐదేళ్లకు ఒకసారి మళ్లీ పెట్టుబడి పెడితే, మొత్తం మెచ్యూరిటీ 25 ఏళ్లు అవుతుంది. తద్వారా రూ. 1 కోటి 03 లక్షల 08 వేలు డిపాజిట్ అవుతుంది. మొత్తంగా25 సంవత్సరాల తర్వాత పెట్టుబడి రూ. 37.50 లక్షలు. అయితే రూ. 65 లక్షల 58 వేలు వడ్డీగా లభిస్తుందన్నమాట.