పీపీఎఫ్ విత్‌డ్రాయల్స్ (ప్రతీకాత్మక చిత్రం)
న్యూఢిల్లీ : ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) లాంటి స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ నుంచి నగదును విత్‌డ్రా చేసుకోవడం ఇక నుంచి సులభతరం కానుంది. స్మాల్ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ తమ అకౌంట్లను ముందస్తుగా క్లోజ్ చేసుకోవడానికి అనుమతిస్తూ మంగళవారం కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రొవిజన్లను ప్రతిపాదించింది. ప్రస్తుతం పీపీఎఫ్ లాంటి స్మాల్ సేవింగ్స్ అకౌంట్లను ఐదేళ్లు పూర్తి కాకుండా మూసివేయడం కుదరదు. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించి కొత్త ప్రొవిజన్లతో అకౌంట్ యూజర్లు ఎప్పుడు కావాలంటూ అప్పుడు, గడువు ముగియక ముందే స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికి వీలుగా పీపీఎఫ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వంటి స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ చట్టాలపై సవరణలు చేపట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. మెడికల్ ఎమర్జెన్సీస్, ఉన్నత విద్యా వంటి వాటికోసం పీపీఎఫ్ అకౌంట్లను ముందుగా మూసివేసుకోవచ్చని ఆర్థికమంత్రిత్వ శాఖ పేర్కొంది.
అంతేకాక మైనర్ తరుఫున గార్డియన్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌లో పెట్టుబడులు పెట్టొచ్చని కూడా తెలిపింది. దీనికి సంబంధించిన హక్కులు, బాధ్యతలన్నీ గార్డియన్ చేతుల్లో ఉంటాయన్నారు. అయితే ప్రస్తుతమున్న చట్టాల్లో మైనర్ల డిపాజిట్లకు సంబంధించి ఎలాంటి ప్రొవిజన్లు లేవు. అంతేకాక దివ్యాంగుల స్మాల్ సేవింగ్స్ అకౌంట్లకు కూడా ప్రత్యేక ప్రొవిజన్‌ను తీసుకొచ్చింది. బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ ఎక్కువ వడ్డీరేట్లను ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. వడ్డీరేట్లు అత్యధికమే కాకుండా ఆదాయపు పన్ను ప్రయోజనాలు వీరు పొందవచ్చు. అయితే ప్రస్తుతం చేసిన సవరణలతో స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రేటు లేదా పన్ను పాలసీలో ఎలాంటి మార్పులు కాలేదని ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment