PPF money
-
పొదుపు పట్ల మహిళల్లో అప్రమత్తత
న్యూఢిల్లీ: పొదుపు విషయమై మహిళల్లో అధిక అప్రమత్తత ఉంటున్నట్టు ఓ సర్వే ఫలితాల ఆధారంగా తెలుస్తోంది. ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు) లేదా పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయడానికే 58 శాతం మంది మహిళలు ప్రాధాన్యం ఇస్తున్నారు. లేదంటే బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో ఉంచేస్తున్నారు. ఆన్లైన్ వేదికగా ఆర్థిక సేవలు అందించే స్క్రిప్‌బాక్స్ అక్టోబర్ నెల మొదటి రెండు వారాల్లో నిర్వహించిన సర్వే ద్వారా ఈ వివరాలు తెలిశాయి. ఇక మరో 6 శాతం మంది మహిళలు బంగారం కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పడం గమనార్హం. అదనపు ఆదాయాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులుగా పెడతామని 15 శాతం మగువలు చెప్పారు. ప్రముఖ ఫేస్బుక్ కమ్యూనిటీల ఆధారంగా 400 మంది మహిళల నుంచి అభిప్రాయాలు సేకరించి స్క్రిప్‌బాక్స్ ఈ వివరాలు వెల్లడించింది. వీరిలో 54 శాతం మంది మిలీనియల్స్ (1980–2000 మధ్య జన్మించిన వారు) ఉన్నారు. ► సర్వేలో పాలు పంచుకున్న మిలీనియల్స్‌లో మూడొంతులు మంది పొదుపు పట్ల ఎంతో సానుకూలంగా ఉన్నట్టు సర్వే తెలిపింది. ► ప్రతీ ఆరుగురు మిలీనియల్స్‌లో ఒకరు విహార యాత్రల కోసం డబ్బును పక్కన పెట్టడానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ► నాన్ మిలీనియల్స్ మహిళల్లో సగం మంది రిటైర్మెంట్ నిధి, పిల్లల విద్య కోసం కొంత మేర పక్కన పెడతామని వెల్లడించారు. ► ఈ వయసు గ్రూపులోని వారికి పన్ను ఆదా చేసే పీపీఎఫ్, ఎల్ఐసీ పథకాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు ప్రాముఖ్యంగా ఉన్నాయి. నాన్ మిలీనియల్స్‌లో 33% మంది వీటికే ఓటేశారు. 26% మంది మాత్రం దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధనకు మ్యూచువల్ ఫండ్స్ సాయపడతాయని చెప్పారు. ► అవసరమైన సందర్భాల్లో తమ కష్టార్జితాన్ని సులభంగా, వెంటనే పొందే వెసులుబాటు ఉండాలని సర్వేలో పాల్గొన్న మహిళల్లో 44 శాతం మంది పేర్కొన్నారు. ► అత్యవసర నిధికి ఎక్కువ మంది మొగ్గు చూపించారు. 36 శాతం మంది అజెండాలో దీనికే అగ్ర ప్రాధాన్యం ఉంది. తర్వాత పిల్లల విద్య కోసం 28 శాతం మంది, రిటైర్మెంట్ కోసం నిధి ఏర్పాటుకు 26 శాతం మంది మొగ్గు చూపించారు. ► తమకు ఎటువంటి ఆర్థిక లక్ష్యం లేదని 25 శాతం మంది చెప్పడం గమనార్హం. ఆర్థిక ప్రణాళిక ఏర్పాటు, ఆర్థిక లక్ష్యాల సాధన విషయంలో 28 శాతం మంది నమ్మకంగా ఉన్నారు. పొదుపు, మదుపు వేర్వేరు.. పొదుపు చేయడం, పెట్టుబడి(మదుపు) పెట్టడం అనేవి నాణేనికి రెండు ముఖాలు. కానీ వీటి మధ్య చాలా పెద్ద వ్యత్యాసమే ఉంది. అత్యవసరాల కోసం డబ్బులను పక్కన పెట్టుకోవడం పొదుపు అవుతుంది. దీనిపై రాబడులు నామమాత్రంగాను లేదా అసలు లేకపోవచ్చు. కానీ పెట్టుబడులు అనేవి సంపదను సృష్టించుకునేందుకు క్రమబద్ధమైన విధానం. ద్రవ్యోల్బణాన్ని మించి నికర విలువ వృద్ధి చెందేందుకు, పిల్లల విద్య, రిటైర్మెంట్ అవరాల కోసం నిధిని సమకూర్చుకునేందుకు మార్కెట్ ఆధారిత (ఈక్విటీ) ఇన్వెస్ట్మెంట్ సాధనాలు తోడ్పడతాయి’’అని స్క్రిప్‌బాక్స్ సీఈవో ఆశిష్ కుమార్ తెలిపారు. -
పీపీఎఫ్ విత్డ్రాయల్స్పై గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ : ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) లాంటి స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ నుంచి నగదును విత్‌డ్రా చేసుకోవడం ఇక నుంచి సులభతరం కానుంది. స్మాల్ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ తమ అకౌంట్లను ముందస్తుగా క్లోజ్ చేసుకోవడానికి అనుమతిస్తూ మంగళవారం కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రొవిజన్లను ప్రతిపాదించింది. ప్రస్తుతం పీపీఎఫ్ లాంటి స్మాల్ సేవింగ్స్ అకౌంట్లను ఐదేళ్లు పూర్తి కాకుండా మూసివేయడం కుదరదు. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించి కొత్త ప్రొవిజన్లతో అకౌంట్ యూజర్లు ఎప్పుడు కావాలంటూ అప్పుడు, గడువు ముగియక ముందే స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికి వీలుగా పీపీఎఫ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వంటి స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ చట్టాలపై సవరణలు చేపట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. మెడికల్ ఎమర్జెన్సీస్, ఉన్నత విద్యా వంటి వాటికోసం పీపీఎఫ్ అకౌంట్లను ముందుగా మూసివేసుకోవచ్చని ఆర్థికమంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాక మైనర్ తరుఫున గార్డియన్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌లో పెట్టుబడులు పెట్టొచ్చని కూడా తెలిపింది. దీనికి సంబంధించిన హక్కులు, బాధ్యతలన్నీ గార్డియన్ చేతుల్లో ఉంటాయన్నారు. అయితే ప్రస్తుతమున్న చట్టాల్లో మైనర్ల డిపాజిట్లకు సంబంధించి ఎలాంటి ప్రొవిజన్లు లేవు. అంతేకాక దివ్యాంగుల స్మాల్ సేవింగ్స్ అకౌంట్లకు కూడా ప్రత్యేక ప్రొవిజన్‌ను తీసుకొచ్చింది. బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ ఎక్కువ వడ్డీరేట్లను ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. వడ్డీరేట్లు అత్యధికమే కాకుండా ఆదాయపు పన్ను ప్రయోజనాలు వీరు పొందవచ్చు. అయితే ప్రస్తుతం చేసిన సవరణలతో స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రేటు లేదా పన్ను పాలసీలో ఎలాంటి మార్పులు కాలేదని ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది. -
పీపీఎఫ్ డబ్బు వెనక్కి తీసుకోవాలంటే.. ఎనిమిదేళ్లు ఉండాల్సిందే!
న్యూఢిల్లీ: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఖాతాలో పెట్టుబడి పెట్టేవారు ఒకవేళ దాన్ని వెనక్కి తీసుకోవాలని భావిస్తే కనీసం ఎనిమిదేళ్లు వేచి చూడాల్సిందే. పీపీఎఫ్ 0ఇన్వెస్ట్మెంట్ ఉపసంహరణకు కనీస కాలపరిమితి (లాకిన్ పిరియడ్) పెంచాలన్న ప్రతిపాదనను ఆర్థికమంత్రిత్వశాఖ పరిశీలిస్తున్న విషయాన్ని సంబంధిత వర్గాలు బుధవారం తెలియజేశాయి. ప్రస్తుతం ఈ కాలపరిమితి ఆరేళ్లు.పీపీఎఫ్ పెట్టుబడి మెచ్యూరిటీ కాల పరిమితిని ప్రస్తుత 15 ఏళ్ల నుంచి మరింత పెంచే ప్రతిపాదన కూడా ఆర్థిక మంత్రిత్వశాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం. మౌలిక రంగం అభివృద్ధికి సంబంధించి దీర్ఘకాలిక నిధుల లభ్యత కోసం ఈ ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టే బడ్జెట్లో కేంద్రం మౌలిక రంగం అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని అధికార వర్గాలు ఈ సందర్భంగా ప్రస్తావించాయి. పీపీఎఫ్ వివరాలు ఇవీ: ప్రస్తుతం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో రూ.1.50 లక్షల వరకూ పెట్టుబడులకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ కింద మినహాయింపు ప్రయోజనం లభిస్తోంది. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌పై వడ్డీరేటు 8.7 శాతంగా ఉంది. వార్షికంగా కనిష్టంగా రూ.500, గరిష్టంగా రూ.1.5 లక్షలు పెట్టుబడులు పెట్టే వీలుంది. వ్యక్తిగతంగా ఆరేళ్ల తరువాత ఇన్వెస్టర్ తన పీపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బు వెనక్కు తీసుకోడానికి వీలుంది. నాలుగో ఏడాది తన అకౌంట్ కలిగిఉన్న మొత్తం ఫండ్‌లో గరిష్టంగా 50 శాతాన్ని అత్యవసర వ్యయం లేదా ఉన్నత విద్యకోసం ఉపసంహరించుకునే వీలూ ఉంది. 15 ఏళ్ల తరువాత మొత్తం మెచ్యూరిటీ అవుతుంది.