ఇక నుంచి పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సేవలు
డోన్ టౌన్: ఇకపై అన్ని పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్, జీవిత బీమారంగ సేవలు అందుబాటులో ఉంటాయని రీజియన్ పోస్టుమాస్టర్ జనరల్ సంజీవరంజన్ తెలిపారు. బుధవారం డోన్ కేంద్ర తపాలా కార్యాలయంతోపాటు రైల్వే ఆర్‌ఎమ్‌ఎస్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోస్టల్ శాఖలో సమూల మార్పులు తీసుకువచ్చామని, ఖాతాదారులకు విస్తృతసేవలు అందించేందుకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పోస్టాఫీసుల్లో పొదుపు చేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతప్రచారం చేయాలని ఆయన సిబ్బందికి సూచించారు. స్పీడ్‌పోస్టు, రిజిస్టర్‌పోస్టు సేవలందించడంలో డోన్ పోస్టాఫీసు వెనుకబడి ఉందని ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆయన వెంట డివిజనల్ పోస్టల్ సూపరిండెంట్ సుబ్బారావు, పోస్టల్ ఇన్‌స్పెక్టర్ విజయమోహన్, బ్రాంచ్ పోస్టుమాస్టర్ సుధాకర్, సిబ్బంది సుజాత, లావణ్య, పద్మావతి, పోస్టల్ ఏజెంట్ల సంఘం నాయకుడు రామారావు తదితరలు ఉన్నారు.