భారత్‌కు చెందిన పోస్టల్ డిపార్ట్‌మెంట్ కెనడా ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందంతో భారతీయులు స్థానిక పోస్టాఫీస్‌ల నుంచి కెనడాకు పార్శిళ్లను పంపుకోవచ్చు. ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్ సర్వీస్ (ITPS) పేరుతో కార్యకలాపాలు జూన్ 30 నుంచి ప్రారంభమయ్యాయి.
కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన ప్రకారం.. భారతీయులు నిర్వహించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) యూనిట్లు, చిన్న వ్యాపారాలు లేదంటే తయారు చేసిన వస్తువుల్ని, వారి వ్యాపారాల్ని మరింత విస్తరించేందుకు వీలుగా లేదంటే వ్యాపారాల్ని కెనడాకు సైతం సులభంగా ఎగుమతి చేసుకునేందుకు వీలుగా భారత్ - కెనడా ప్రభుత్వాలు ఈ కొత్త సర్వీసుల్ని రూపొందించాయి. తద్వారా ఎగుమతిదారుల సరిహద్దు షిప్పింగ్ అవసరాలు తీరిపోనున్నాయి. భారత్ ఇప్పటికే ఐటీపీఎస్ తరహా సేవల్ని 38 దేశాల‍్లో అందిస్తుండగా.. తాజాగా కెనడాతో కుదుర్చుకున్న ఒప్పందంతో ఆ సంఖ్య మొత్తం 39కి చేరింది.
39 దేశాల్లో పోస్టాఫీస్ సేవలు
జూన్ 1, 2023 ముందు వరకు 16 దేశాలకు మాత్రమే దేశీయ పోస్టాఫీసుల నుంచి దేశీయంగా తయారు చేసిన వస్తువల్ని విదేశాలకు పంపుకునే వెసలు బాటు ఉంది. జూన్ 1 తర్వాత ఆ సంఖ్య 38కి చేరింది. భారత్ కొత్తగా ఒప్పందం చేసుకున్న దేశాల జాబితాలో ఫ్రాన్స్, బ్రిటన్, యూఏఈ, ఈజిప్ట్‌తో పాటు ఇతర దేశాలు ఉన్నాయి.
ధరలు ఎలా ఉన్నాయి
ఇంటర్‌నేషనల్ స్పీడ్ పోస్ట్, ఇతర మార్కెట్ సంస్థల ఉత్పత్తులతో పోల్చితే ఐటీపీఎస్ రేట్లు అందుబాటులో ఉన్నాయని పోస్టల్ డిపార్ట్‌మెంట్ అధికారులు చెబుతున్నారు. మొదటి 50 గ్రాముల పార్శిళ్లపై రూ.400 వసూలు చేస్తుండగా.. అదనంగా ప్రతి 50 గ్రాములకు రూ.35 చొప్పున చెల్లించాలి. ఇలా 2 కేజీల వరకు నామమాత్రంగా సర్వీసులు ఛార్జీలు వసూలు చేస్తుండగా.. ఆపై వస్తువు బరువు, ప్రాంతాన్ని బట్టి రేట్లు మారతాయని పోస్టల్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన నోటీసుల్లో పేర్కొంది.
ఇదీ చదవండి : పాకిస్తాన్‌లో జాక్‌మా ప్రత్యక్షం.. రహస్య ప్రాంతంలో
Comments
Please login to add a commentAdd a comment