ఆన్‌లైన్‌ లావాదేవీలు సులభతరం | online transaction is easy | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ లావాదేవీలు సులభతరం

Published Wed, Nov 30 2016 11:25 PM | Last Updated on Mon, Sep 4 2017 9:32 PM

online transaction is easy

- జేసీ హరికిరణ్‌
కర్నూలు(అగ్రికల్చర్‌): ఆన్‌లైన్‌ లావాదేవీలు సులభతరమని, నగదు రహిత లావాదేవీలపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించాలని జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌ పేర్కొన్నారు. బుధవారం ఎంఈఓలు, బ్యాంకర్లు, డిగ్రీ, జూనియర్‌ కళాశాల అధ్యాపకులు, వివిధ వర్గాల వారికి ఆన్‌లైన్‌ లావాదేవీలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మొబైల్‌ బ్యాంకింగ్, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ తదితర వాటిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ యాక్సిస్‌ పే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని మొబైల్‌ ద్వారా సులభంగా బ్యాంకింగ్‌ వ్యవహారాలను చేపట్టవచ్చని వివరించారు. నగదు బదిలీ కూడా సెల్‌ఫోన్‌ ద్వారా చేసుకోవచ్చని సూచించారు. ఆధార్‌ యనబుల్‌టీ పేమెంటు సిస్టమ్‌ ద్వారా ఒక ఆధార్‌ నుంచి మరో ఆధార్‌కు నగదు, విత్‌డ్రా, క్యాష్‌ డిపాజిట్, నగదు బదిలీ వంటి వాటిని చేపట్టవచ్చని వివరించారు. మైక్రో ఏటీఎంల ద్వారా సులభంగా లావాదేవీలు నిర్వహించవచ్చని సూచించారు. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ వ్యవహారాలపై హైస్కూళ్లలో 8,9, 10 తరగతుల విద్యార్థులకు, జూనియర్, డిగ్రీ విద్యార్థులందరికీ మొబైల్‌ బ్యాంకింగ్, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఎల్‌డీఎం నరసింహరావు, డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ రామకృష్ణ, వివిధ బ్యాంకుల అధికారులు తదితరులు పాల్గొన్నారు.   
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement