ప్రతి కుటుంబానికీ డెబిట్ కార్డు
ప్రతి కుటుంబానికీ డెబిట్ కార్డు
Published Wed, Nov 23 2016 11:24 PM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM
–పదిలో రోజుల్లో అందజేయాలి
– ఒకటి నుంచి నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలి
– వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఆదేశాలు
కర్నూలు(అగ్రికల్చర్): ప్రతి కుటుంబానికి డెబిట్ కార్డు పంపిణీ చేసి..అన్ని వర్గాల ప్రజలకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించాలని మండలస్థాయి అధికారులను జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 10 లక్షల కుటుంబాలు ఉన్నాయని, ఇంటింటికి తిరిగి ఖాతా ప్రారంభించి డెబిట్ కార్డు అందించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టి 10 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. మండలస్థాయిలో తహసీల్దారు, ఏంపీడీఓ, డీఆర్‌డీఏ ఏపీఎం, డ్వామా ఏపీఓ, వ్యవసాయాధికారి.. ప్రత్యేక బృందంగా ఏర్పడాలన్నారు. ఎన్టీఆర్ భరోస పింఛన్లను డిసెంబరు ఒకటో తేదీనే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేయడంపై దృష్టి సారించాలన్నారు. పింఛన్‌దారుల్లో ప్రతి ఒక్కరికి ఖాతా ప్రారంభించి డెబిట్ కార్డు ఇవ్వాలన్నారు. ఉఫాది వేతనాలను విధిగా ఆన్‌లైన్ ద్వారా పంపిణీ చేయాలని సూచించారు. నగదు లావాదేవీలు ఉన్న ప్రతి చోట ఈ–పాస్ మిషన్‌లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని 1850 మంది డీలర్లను బిజినెస్ కరస్పాండెం ట్లుగా నియమిస్తున్నట్లు తెలిపారు. ప్రజా పంపిణీని 1వ తేదీ నుంచి నగదు రహితంగానే చేపడుతున్నట్లు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ హరికిరణ్, సీపీఓ ఆనంద్‌నాయక్, డ్వామా పీడీ పుల్లారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ రామకృష్ణ, జిల్లా పంచాయతీ అధికారి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement