సహకారం.. నగదు రహితం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా సహకార కేంద్రబ్యాంకుతో సహా అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో నగదు రహిత సేవలు అందించడానికి చర్యలు ఊపందుకున్నాయి. బుధవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో నగదు రహిత సేవలు అందించేందుకు వీలుగా ఎంపాస్ మిషన్‌లను మంత్రుల చేతుల మీదుగా కేడీసీసీబీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, సీఇఓ రామాంజనేయులు అందకున్నారు. త్వరలోనే జిల్లాలోని 95 సహకార సంఘాలకు ఎంపాస్ మిషన్‌లను పంపిణీ చేయనున్నారు. అదే విధంగా డీసీసీబీ బ్రాంచీల్లోను నగదు రహిత సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు చైర్మన్ మల్లికార్జునరెడ్డి తెలిపారు