
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి సోమవారం భేటీ అయ్యారు. తమ ప్రభుత్వానికి కేంద్రం నుంచి సహకారం లభిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఈ రోజు గౌరవ ప్రధాని నరేంద్రమోదీ గారిని కలిశాను.
మన రాజధాని సంక్షేమం, అభివృద్ధి గురించి ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం కోసం ఎదురు చూస్తున్నాను’’ అని ఆమె ఎక్స్‌లో పోస్టు చేశారు. గత నెలలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆమె మొదటిసారి ప్రధానిని కలిశారు. ఈ సమావేశం గురించి ప్రధాన మంత్రి కార్యాలయం కూడా ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment