chief minister of delhi
-
ప్రధాని మోదీతో ఢిల్లీ సీఎం అతిశి భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి సోమవారం భేటీ అయ్యారు. తమ ప్రభుత్వానికి కేంద్రం నుంచి సహకారం లభిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఈ రోజు గౌరవ ప్రధాని నరేంద్రమోదీ గారిని కలిశాను. మన రాజధాని సంక్షేమం, అభివృద్ధి గురించి ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం కోసం ఎదురు చూస్తున్నాను’’ అని ఆమె ఎక్స్‌లో పోస్టు చేశారు. గత నెలలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆమె మొదటిసారి ప్రధానిని కలిశారు. ఈ సమావేశం గురించి ప్రధాన మంత్రి కార్యాలయం కూడా ఎక్స్‌లో పోస్ట్ చేసింది. -
రామ్‌లీలా మైదానంలో 26న కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఈనెల 26వ తేదీ గురువారం రామ్‌లీలా మైదానంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎన్నో పోరాటాలకు వేదికగా నిలిచిన జంతర్మంతర్లోనే ప్రమాణ స్వీకారం చేయాలని ముందు అనుకున్నారు. అయితే ప్రమాణ స్వీకార స్థలం ప్రస్తుతం జంతర్‌మంతర్ నుంచి రామ్‌లీలా మైదానంకు మారింది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు కేజ్రీవాల్ అధికారికంగా లేఖ ఇచ్చారు. ఆ లేఖను లెప్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతికి పంపుతారు. మొత్తం తాము గెలిచిన 28 నియోజకవర్గాల్లో సర్వే చేయించి అధికారం చేపట్టాలని ఏఏపీ నిర్ణయించుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ ఏఏపీకి 6 లక్షల 97 వేల ఎస్ఎంఎస్లు వెళ్లాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఏఏపీ నిర్ణయాన్ని షీలాదీక్షిత్ స్వాగతించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఏఏపీనెరవేరుస్తుందన్న ఆశాభావం ఆమె వ్యక్తం చేశారు. ఏఏపీకి షరతులతో కూడిన మద్దతు ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. భేషరతు మద్దతని తాము ఎప్పుడూ చెప్పలేదన్నారు.