swipe
-
రూ.4 వేలకే అద్భుతమైన స్మార్ట్‌ఫోన్
పూణె(మహారాష్ట్ర): స్వైప్ టెక్నాలజీస్ సరసమైన ధరలో ఓ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం మార్కెట్లోకి లాంచ్ చేసింది. రూ.3,999కే స్వైప్ ఎలైట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లోనే లభ్యం కానుంది. నలుపు, బూడిద, బంగారం రంగులలో ఈ ఫోన్ మార్కెట్లో లభించనున్నట్టు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీపాల్ గాంధీ తెలిపారు. భారతీయ వినియోగదారులను అనుగుణంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేసినట్లు ఆయన తెలిపారు. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై యాక్సిస్ బ్యాంకు బుజ్ కార్డ్ హోల్డర్స్‌కు 5 శాతం తగ్గింపును కూడా కంపెనీ ఇవ్వనుంది. గత వారమే స్వైప్, ఎలైట్ వీఆర్ అనే స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం 4జీ యూజర్లను టార్గెట్‌గా చేసుకునే ఎలైట్ 4జీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఫోన్ ప్రత్యేకతలు: ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో 1.3 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ 5 అంగుళాల హెచ్డీ ఎఫ్డబ్ల్యూవీజీఏ డిస్ప్లే 8 మెగా పిక్సెల్ వెనుక కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 మెగా పిక్సెల్ ముందు కెమెరా 1 జీబీ ర్యామ్ 8జీబీ స్టోరేజ్, 64 జీబీ వరకు విస్తరణ మెమరీ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 2500 ఎంఏహెచ్ బ్యాటరీ 4జీ వాయిస్ ఓవర్ ఎల్టీఈ డ్యూయల్ సిమ్(మైక్రో+నానో) 3.5ఎంఎ ఆడియో జాక్ -
సర్‌చార్జ్!
స్వైప్ చేస్తే నగదు స్వీపే.. – రూ. 100కు రూ. 11.50 వసూలు – వినియోగదారులకు భారం – పెట్రోల్ బంకుల్లో అయోమయం.. ‘ ఎమ్మిగనూరుకు చెందిన రఘువీర్ ఈనెల 4న రూ.15,844ల డీజిల్ వేయించుకొని అమౌంట్‌ను స్వైప్ మిషన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు. అరగంట తర్వాత తన అకౌంట్ నుంచీ పైమొత్తంతోపాటు రూ.455.52 డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది.’ ‘‘ ఆలూరు నియోజకవర్గంలో పనిచేసే వ్యవసాయాధికారి పాపిరెడ్డి ఎమ్మిగనూరు పెట్రోల్ బంకులో రూ.100లు పెట్రోల్‌ను స్వైప్ద్వారా వేయించుకొన్నాడు.అతని బ్యాంక్ అకౌంట్లో రూ.100తోపాటు రూ.11.50లు అదనంగా డెబిట్ అయ్యింది.’ ఎమ్మిగనూరు : ‘ప్రజలంతా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపు మళ్లాలి.. నగదు రహిత విధానంతో చిల్లర సమస్య ఉండదు. నగదు కొరత అసలే ఉండదు.’ ఇవీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చెబుతున్న మాటలు. ఇందుకోసం ప్రభుత్వం ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన సద్సులు కూడా నిర్వహిస్తోంది. నోట్ల రద్దు నేపథ్యంలో చాలా మంది గత్యంతరం లేక నగదు రహిత లావాదేవీలపై మొగ్గు చూపారు. బాదుడే.. బాదుడు.. అయితే డిసెంబర్ 31 తర్వాత ఆంక్షలు ఎత్తివేయటంతో సర్‌చార్జీల పేరుతో వినియోగదారులను బాదేస్తున్నారు. స్వైప్ ద్వారా పెట్రోల్ బంకుల్లో లావాదేవీలు జరిపే వినియోగదారులు లబోదిబోమంటున్నారు. పెట్రోల్ బంకుల్లో రూ.100లు ఇంధనానికి రూ. 11.50లు చార్జీ వసూలు చేస్తున్నారు. స్వైప్ చేసినప్పుడు రూ.100 మాత్రమే చూపుతున్నా తర్వాత వినియోగదారుడి బ్యాంకు ఖాతాలో రూ.11.50 డెబిట్ అవుతోంది. అదే విధంగా ఇతర వ్యాపారులు స్వైప్ మిషన్లు వాడితే వినియోగదారుడిపై కాకుండా షాపు యజమానులకు సర్‌చార్జి పడుతోంది. కిరాణా కొట్టులో రూ.100లు బిల్లు చేసి స్వైప్ చేస్తే షాపు యజమాని ఖాతాలో రూ.92లు మాత్రమే జమవుతుంది. అదేవిధంగా వినియోగదారుడిపై రూ.2.8 శాతం అదనంగా చార్జిలు పడుతున్నాయి. బంక్‌లు, బ్యాంకుల మధ్య వార్.. ఈ నెల 1 నుంచి 8 వరకు ప్రతి ట్రాన్సాక్షన్‌పై రూ. 11.50లు వినియోగదారులపై సర్చార్జిలు వసూలు చేస్తున్నారు. సోమవారం నుంచి ప్రతి లావాదేవీలపైనా పెట్రోల్ బంక్ యజమానులకు కూడా 1 శాతం ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) చార్జీలను వర్తింపజేస్తుండడంతో అందరూ ఏకమయ్యారు. పెట్రోల్, డీజిల్ బంక్‌ల్లో సోమవారం నుంచి క్రికెట్, డెబిట్ కార్డులకు అనుమతించేది లేదంటూ బోర్డులు పెట్టారు. అయితే ఉన్నత స్థాయిలో జరిగిన చర్చల మేరకు ఈనెల 13 వరకు నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. కేవలం వ్యాపారులపై 1 శాతం సర్‌చార్జి పడుతుంటే అందరూ ఏకమై నిర్ణయాలు తీసుకుంటున్నారు.‘ అయితే వినియోగదారుడిపై ఏకంగా రూ. 11.50 ప్రతి లావాదేవీలపై అదనంగా పడుతున్నా స్పందించే వారు కరువయ్యారు. వ్యాపారాలపై దెబ్బ నగదు రహిత లావాదేవీలతో వ్యాపారులు వృద్ధి చెందుతాయనుకున్నాం. కానీ రూ.100లు పెట్రోల్ పోసుకొనే వినియోగదారుడిపై రూ.11.50లు అదనంగా చార్జీలు పడుతుంటం బాధనిపించింది. ఇప్పుడు ఏకంగా మాపై కూడా 1 శాతం సర్‌చార్జీలు వేస్తామని నోటీసులు పంపారు. ఈనెల 13 వరకు నిర్ణయం వాయిదా వేసుకొన్నారు. ఇలా జరిగితే వ్యాపారాలపై దెబ్బ పడుతుంది. -జి.ఎం. మహేంద్ర, పెట్రోల్ బంకు యజమాని చార్జీలు తప్పని సరి నగదు రహిత లావాదేవీలపై 2016 డిసెంబర్ 31 వరకు మాత్రమే ఆంక్షలు ఉండేవి. జనవరి 1 నుంచి పెట్రోల్ బంకుల్లో జరిగే లావాదేవీలపై వినియోగదారుడిపై రూ. 11.50లు చార్జీలు పడతాయి. ఇతర వ్యాపారాల్లో వ్యాపారులకు 8 శాతం వరకు చార్జీలు వర్తిస్తాయి. నిబంధనలను మార్చలేం. – కిరణ్, ఎస్బీఐ స్వైప్ మిషన్ రీజినల్ ఇంచార్జి -
డిజిటల్ లావాదేవిలపై ఫిర్యాదుల వెల్లువ
-
సహకారం.. నగదు రహితం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా సహకార కేంద్రబ్యాంకుతో సహా అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో నగదు రహిత సేవలు అందించడానికి చర్యలు ఊపందుకున్నాయి. బుధవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో నగదు రహిత సేవలు అందించేందుకు వీలుగా ఎంపాస్ మిషన్లను మంత్రుల చేతుల మీదుగా కేడీసీసీబీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, సీఇఓ రామాంజనేయులు అందకున్నారు. త్వరలోనే జిల్లాలోని 95 సహకార సంఘాలకు ఎంపాస్ మిషన్లను పంపిణీ చేయనున్నారు. అదే విధంగా డీసీసీబీ బ్రాంచీల్లోను నగదు రహిత సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు చైర్మన్ మల్లికార్జునరెడ్డి తెలిపారు -
షాపులో స్వైప్ మిషన్లు ఏర్పాటు చేసుకోవాలి
కర్నూలు(రాజ్‌విహార్): నగదు, చిల్లర సమస్య పరిష్కారం కోసం వ్యాపార, వాణిజ్య సంస్థల్లో స్వైప్ మిషన్లు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ మల్లేశ్వర కుమార్ సూచించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో రూ.500, రూ.1000 నోట్లను బ్యాంకుల ఖాతాల్లో జమచేసుకున్నట్లు వెల్లడించారు. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు, చేతిలో రూ.2వేల నోట్లు ఉన్నప్పటికీ చిల్లర సమస్యతో జనం ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిని పరిష్కరించేందుకు నగదు రహిత వ్యాపారాలు, లావాదేవీలు జరిగేలా చూడాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. ఈక్రమంలో ప్రతి షాపు, వ్యాపార దుకాణ యజమానులందరూ తప్పనిసరిగా స్వైప్ మిషన్లు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. వీటిని ఆయా దుకాణదారులు తమ ఖాతా ఉన్న బ్యాంకుల్లో ఉచితంగా పొందవచ్చన్నారు. దీని పర్యవేక్షణకు కర్నూలు నగరంలో కార్మిక శాఖతోపాటు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, గ్రామీణ ప్రాంతాల్లో తమ అధికారులతోపాటు డీఆర్డీఏ ఉద్యోగులు షాపులకు వెళ్లి తనిఖీలు నిర్వహిస్తారన్నారు. -
స్వైప్ కొత్త స్మార్ట్‌ఫోన్.. ధర తక్కువే!
బడ్జెట్ ధరలో టాబ్లెట్ పీసీలు, ఫాబ్లెట్స్, స్మార్ట్ఫోన్లు ఆఫర్ చేసే స్వైప్ టెలికాం.. తాజాగా మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. స్వైప్ కనెక్ట్ ప్లస్ పేరుతో ఆవిష్కరించిన ఈ నూతన ఫోన్ ధరను రూ.4,999గా ప్రకటించింది. ఈ ఫోన్ ప్రత్యేకంగా స్నాప్‌డీల్‌లో మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉంచినట్టు స్వైప్ తెలిపింది. తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్లతో ఈ ఫోన్‌ను స్వైప్ రూపొందించింది. జెన్ సినీమ్యాక్స్ 3 మాదిరిగా స్యాండ్స్టోన్ ఫినిస్ బ్యాక్ ప్యానెల్ ఈ ఫోన్ ప్రత్యేకత. స్వైప్ కనెక్ట్ ప్లస్ ఫీచర్లు... 5 అంగుళాల హెచ్డీ(720x1280 పిక్సెల్స్) ఐపీఎస్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ 1.2గిగిహెడ్జ్ క్వాడ్ కోర్ ఎస్ఓసీ డ్యుయల్ సిమ్(రెగ్యులర్+మైక్రో) 2 జీబీ ర్యామ్ 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 16 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ 3000ఎంఏహెచ్ బ్యాటరీ 156 గ్రాములు కనెక్టివిటీ ఆప్షన్లు.. 3జీ, వై-ఫై, జీపీఎస్, ఎఫ్ఎం రేడియో, బ్లూటూత్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, మైక్రో-యూఎస్బీ -
ఐసీఐసీఐ బ్యాంక్.. కాంటాక్ట్‌లెస్ కార్డులు
స్వైప్ చేయకుండానే చెల్లింపులు ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్ భారత్‌లో తొలిసారిగా కాంటాక్ట్‌లెస్ క్రెడిట్, డెబిట్ కార్డులను ప్రవేశపెట్టింది. ఈ కోరల్ కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డులు, ఎక్స్ప్రెషన్స్ వేవ్ డెబిట్ కార్డులు నియర్ఫీల్డ్ కమ్యూనికేషన్(ఎన్ఎఫ్సీ) టెక్నాలజీతో పనిచేస్తాయని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. ఈ కార్డులను స్వైప్ చేయాల్సిన అవసరం లేదని, కదిలిస్తే చెల్లింపులు జరిగిపోతాయని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రాజీవ్ సబర్వాల్ చెప్పారు. ఎన్ఎఫ్సీ టెక్నాలజీ వల్ల లావాదేవీలు వేగంగా జరుగుతాయని, పైగా అత్యంత సురక్షితంగా కూడా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్డులను మొదటగా హైదరాబాద్, ముంబై, గుర్గావ్లో అందించామని పేర్కొన్నారు. ఈ కార్డుల కోసం ఈ నగరాల్లో 1,200 పాయింట్ ఆఫ్ సేల్స్(పీఓఎస్) మెషీన్లను ఏర్పాటు చేశామని వివరించారు. ఇతర నగరాల్లో వీటిని మామూలు డెబిట్/క్రెడిట్ కార్డులమాదిరిగానే ఉపయోగించుకోవచ్చని తెలి పారు. లావాదేవీలు వేగంగా జరగడం, భద్రతకు ఢోకా లేకపోవడం వంటి అంశాల వల్ల చెల్లింపుల పరిశ్రమలో ఈ కాంటాక్ట్‌లెస్ కార్డులు పెను విప్లవం సృష్టించబోతున్నాయని వివరించారు. భారత్‌లో ఇంటర్నెట్, మొబైల్, ట్యాబ్, టచ్ బ్యాంకింగ్‌లను తొలిసారిగా అందించిన ఘనత తమ బ్యాంక్‌దేనని ఆయన గుర్తు చేశారు.