ఐసీఐసీఐ బ్యాంక్.. కాంటాక్ట్‌లెస్ కార్డులు | ICICI Bank launches contactless debit & credit cards | Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ బ్యాంక్.. కాంటాక్ట్‌లెస్ కార్డులు

Published Thu, Jan 8 2015 4:40 PM | Last Updated on Sat, Sep 2 2017 7:21 PM

ఐసీఐసీఐ బ్యాంక్.. కాంటాక్ట్‌లెస్ కార్డులు

ఐసీఐసీఐ బ్యాంక్.. కాంటాక్ట్‌లెస్ కార్డులు

స్వైప్ చేయకుండానే చెల్లింపులు
ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్ భారత్‌లో తొలిసారిగా కాంటాక్ట్‌లెస్ క్రెడిట్, డెబిట్ కార్డులను ప్రవేశపెట్టింది. ఈ కోరల్ కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డులు,  ఎక్స్‌ప్రెషన్స్ వేవ్ డెబిట్ కార్డులు నియర్‌ఫీల్డ్ కమ్యూనికేషన్(ఎన్‌ఎఫ్‌సీ) టెక్నాలజీతో పనిచేస్తాయని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. ఈ కార్డులను స్వైప్ చేయాల్సిన అవసరం లేదని, కదిలిస్తే చెల్లింపులు జరిగిపోతాయని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రాజీవ్ సబర్వాల్ చెప్పారు.

ఎన్‌ఎఫ్‌సీ టెక్నాలజీ వల్ల లావాదేవీలు వేగంగా జరుగుతాయని, పైగా అత్యంత సురక్షితంగా కూడా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్డులను మొదటగా హైదరాబాద్, ముంబై, గుర్గావ్‌లో అందించామని పేర్కొన్నారు. ఈ కార్డుల కోసం ఈ నగరాల్లో 1,200 పాయింట్ ఆఫ్ సేల్స్(పీఓఎస్) మెషీన్లను ఏర్పాటు చేశామని వివరించారు.

ఇతర నగరాల్లో వీటిని మామూలు డెబిట్/క్రెడిట్ కార్డులమాదిరిగానే ఉపయోగించుకోవచ్చని తెలి పారు.  లావాదేవీలు వేగంగా జరగడం, భద్రతకు ఢోకా లేకపోవడం వంటి అంశాల వల్ల చెల్లింపుల పరిశ్రమలో ఈ కాంటాక్ట్‌లెస్ కార్డులు పెను విప్లవం సృష్టించబోతున్నాయని వివరించారు. భారత్‌లో ఇంటర్నెట్, మొబైల్, ట్యాబ్, టచ్ బ్యాంకింగ్‌లను తొలిసారిగా అందించిన ఘనత తమ బ్యాంక్‌దేనని ఆయన గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement